ETV Bharat / bharat

కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి.. మరో 50వేల మందికి వైరస్​ - పాజిటివిటీ రేటు

Corona cases in India: కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 50వేల మందికి వైరస్​ సోకింది. కర్ణాటకలో 33వేల కొత్త కేసులు వచ్చాయి. జనవరి 31 నుంచి రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. దిల్లీలో కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి.

Corona cases in India
కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి
author img

By

Published : Jan 29, 2022, 9:02 PM IST

Updated : Jan 29, 2022, 9:35 PM IST

Corona cases in India: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు దిగొస్తున్నాయి. కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59.31 లక్షలు దాటింది. మరణాలు 53,191కి చేరాయి. 47,649 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో మరో 33వేల కేసులు

కర్ణాటకలో వైరస్​ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం కొత్తగా 33,337 మందికి వైరస్​ సోకింది. మరో 70 మంది వైరస్​కు బలయ్యారు. 69,902 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 19.37 శాతంగా ఉంది.

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత..

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. జనవరి 31 నుంచి 1-9వ తరగతులకు పాఠశాలలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. మహారాష్ట్ర, కేరళ, గోవాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి నిబంధనలు అమలులోనే ఉంటాయని పేర్కొంది.

దిల్లీలో పెరిగిన కొత్త కేసులు..

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్​ తగ్గుముఖం పట్టింది. అయితే.. శుక్రవారంతో పోలిస్తే 400కుపైగా కేసులు పెరిగాయి. శనివారం 4,483 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 28 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.41గా ఉంది. మొత్తం కేసులు 18.23 లక్షలు, మరణాలు 25,797కు చేరాయి.

ఈనెల 31 నుంచి త్రిపురలో పాఠశాలల పునర్​ప్రారంభం

త్రిపురలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర సర్కార్​. జనవరి 31 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, మదర్సాలను తిరిగి తెరిచేందుకు అనుమతించింది. పూర్తిస్థాయి కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంకొత్త కేసులుమరణాలు
తమిళనాడు 24,41846
గుజరాత్​11,974 33
ఆంధ్రప్రదేశ్11,5733
మధ్య ప్రదేశ్8,678 5
ఒడిశా4,84215
హరియాణా4,445 13
జమ్ముకశ్మీర్4,175 5
పుదుచ్చేరి8552
హిమాచల్​ ప్రదేశ్​ 1,714 8

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దేశంలో తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

Last Updated : Jan 29, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.