Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళ వారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,78,956
- మరణాలు: 5,30,707
- యాక్టివ్ కేసులు: 2,582
- రికవరీలు: 4,41,45,667
Vaccination In India :
దేశంలో శుక్రవారం 46,450 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,11,23,642కు చేరింది. ఒక్కరోజే 1,51,186 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
రెండో డోస్‌పై ప్రభుత్వం సూచన..
మరోవైపు, రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఓ సూచన చేసింది. ప్రస్తుతానికి అందరికి రెండో బూస్టర్ డోస్ అవసరం లేదని, ముందుగా మొదటి బూస్టర్ డోస్ పూర్తైన తరువాత దాని గురించి ఆలోచిద్దామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,16,690 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,222 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 665,589,906కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,699,339 మంది మరణించారు. మరో 543,963 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 637,694,360కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 76,264 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో కొత్తగా 40,785 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 249 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా 22,735 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 53 మంది మృతి చెందారు.
- హాంగ్‌కాంగ్‌లో 20,230 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 74 మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో 14,508 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 83 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో కొత్తగా 4,975 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 37 మంది ప్రాణాలు విడిచారు.
ఇవీ చదవండి: