ETV Bharat / bharat

లైవ్ వీడియో: గ్రామస్థులను చితకబాదిన పోలీసులు - మధ్యప్రదేశ్​లో పోలీసుల దాష్టీకం

మధ్యప్రదేశ్​లోని ఖండ్వాలో గ్రామస్థులను చితకబాదారు పోలీసులు. మహిళలని కూడా చూడకుండా లాఠీ ఛార్జ్​ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.

Cops brutally assault villagers in Madhya Pradesh's Khandwa
గ్రామస్థులపై పోలీసుల దాష్టీకం.. కారణం ఇదే!
author img

By

Published : Apr 12, 2021, 9:19 AM IST

లైవ్ వీడియో: గ్రామస్థులను చితకబాదిన పోలీసులు

మధ్యప్రదేశ్​ ఖండ్వా జిల్లాలోని బంజారీ గ్రామంలో పోలీసులు విచక్షణ కోల్పోయి గ్రామస్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పలువురిని చితకబాదారు. అడ్డొచ్చిన మహిళలపైనా లాఠీ ఝుళిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు.

ఇదే కారణం!

ఛాయ్​గావోమకాన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బంజారీ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్​ నిర్థరణ అయిందన్న కారణంగా.. ఆరోగ్య కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. వివాదాన్ని అదుపు చేసేందుకు తాము వెళ్తే.. తమపైనా గ్రామస్థులు రాళ్లు రువ్వారని.. అందుకే లాఠీఛార్జి చేయాల్సివచ్చిందన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వివేక్​ సింగ్​ తీవ్రంగా స్పందించారు. గణపత్ కనేల్, ఆకాశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి : అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.