ETV Bharat / bharat

కర్ఫ్యూ విధుల్లోని పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు - militants attack police party in Anantnag

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు దుశ్చర్యకు పాల్పడ్డారు. కరోనా కర్ఫూలో ఉన్న పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.

militants, cops
కర్ఫ్యూ విధుల్లోని పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు
author img

By

Published : May 1, 2021, 10:44 PM IST

Updated : May 1, 2021, 10:53 PM IST

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరుల దాడిలో గులాం మహ్మద్​ అనే పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

చీకటి కారణంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించినట్లు పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టేందుకు ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.

ఇదీ చూడండి: 'తుపానులో చిక్కుకున్న ఓడలా భారత్​ పరిస్థితి'

Last Updated : May 1, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.