ETV Bharat / bharat

Consumer Court Fines Southern Railway : ట్రైన్​ లేట్ అయినందుకు ప్రయాణికుడికి పరిహారం.. రైల్వేశాఖకు ఫైన్ - భారతీయ రైల్వేకు బారీ జరిమానా

Consumer Court Fines Southern Railway : రైలును ఆలస్యంగా నడిపి ఓ ప్రయాణికుడి అసౌకర్యానికి కారణమయ్యారంటూ దక్షిణ రైల్వేకు రూ.60వేల జరిమానా విధించింది వినియోగదారుల కోర్టు.

consumer court fine southren railway
consumer court fines southren railway
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 10:46 PM IST

Updated : Oct 28, 2023, 8:34 AM IST

Consumer Court Fines Southern Railway : దక్షిణ రైల్వేకు రూ.60,000 జరిమానా విధించింది కేరళలోని ఎర్నాకుళం వినియోగదారుల కోర్టు. చెన్నై-అలెప్పీ ఎక్స్​ప్రెస్​ను​ 13 గంటలు ఆలస్యంగా నడిపి ఓ ప్రయాణికుడికి అసౌకర్యానికి కలిగించినందుకు ఈ జరిమానా విధించింది. ప్రయాణికుడికి పరిహారంగా రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తాన్ని 30 రోజుల వ్యవధిలో చెల్లించాలని దక్షిణ రైల్వేకు స్పష్టం చేసింది. ఛైర్మన్​ డీబీ బిను, సభ్యులు వైకోమ్​ రామచంద్రన్​, టీఎన్ శ్రీవిద్యలతో కూడిన కమిషన్ ఈ తీర్పునిచ్చింది.

ఫిర్యాదుదారుడు తన ప్రయాణ ఉద్దేశాన్ని ముందుగా తెలుపలేదని.. అందువల్లే ముందు జాగ్రత్తలు తీసుకోలేదని రైల్వే శాఖ వాదించింది. వారి వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. చెన్నై డివిజన్​లోని అరకున్నం వద్ద రైల్వేయార్డు పునర్​నిర్మాణ పనుల వల్లే ఆలస్యమైందని గుర్తించింది. పనుల విషయం ముందే తెలిసినా.. ప్రయాణికలకు సరైన సమాచారం ఇవ్వడం, సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాణ్యమైన సేవలను పొందడం ప్రయాణికలకు వరం కాదని.. వారి హక్కు అని గుర్తు చేసింది.

రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు వేరేవాళ్లకు.. రైల్వే శాఖకు రూ.40 వేలు ఫైన్​!
Railway Ticket Confirmation Rules : తమ కుటుంబ సభ్యుల కోసం బుక్​ చేసుకున్న రైలు టిక్కెట్​లను వేరే వాళ్లకు కేటాయించినందుకు గానూ భారతీయ రైల్వేకు రూ.40 వేల జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న అలోక్‌ కుమార్‌ అనే వ్యక్తి 2022 మార్చి 15న తల్లిదండ్రులు, అతడి ప్రయాణం కోసం ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో టికెట్స్​ బుక్​ చేసుకున్నాడు. మే 21న దిల్లీ నుంచి బిహార్​లోని బరౌనీకి వెళ్లేందుకు రాజధాని ఎక్స్​ప్రెస్​ రైలులో రూ.6,995 కట్టి సీట్లను రిజర్వ్​ చేయించుకున్నాడు. అయితే, ప్రయాణం రోజున రైలు ఎక్కే సమయంలో ప్రయాణికుల పీఎన్​ఆర్​ (PNR) నంబర్​ సరిగ్గానే ఉందని.. కానీ టికెట్​ ఇంకా కన్ఫామ్​ కాలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. దీంతో తమకు ముందుగా కేటాయించిన రిజర్వ్​డ్​ సీటును వేరే వ్యక్తులకు ఎలా కేటాయిస్తారన్న విషయంపై కోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. దీనిపై విచారించిన కోర్టు.. రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను ఆదేశించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Fine To Dmart : డీమార్ట్​కు కోర్టు షాక్​.. రూ.100 బెల్లంపై రూ.లక్షకుపైగా ఫైన్​.. కారణమేంటంటే?

Consumer Win 16 Year of Land Case in Hyderabad : స్థలం అభివృద్ధి చేస్తామని మోసం.. 16 ఏళ్ల తర్వాత తీర్పు చెప్పిన వినియోదారుల కమిషన్

Last Updated : Oct 28, 2023, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.