దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు.
"దేశంలో రోజువారి కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్న వేళ.. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం.. ఓ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాన్ని (సీడబ్ల్యూసీ) ఆమోదించనుంది" అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే దేశంలో కరోనా కేసులు పెరుగుదల సహా వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోందని విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. అందరికీ టీకాలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానికి లేఖ రాసింది. అందులో టీకా కార్యక్రమానికి నిధుల కేటాయింపులను పెంచాలని, పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బును బదిలీ చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడిలో కేంద్రానివి తుగ్లక్ చర్యలు'