ETV Bharat / bharat

'చట్టాల రద్దుకు 100 నెలలు పట్టినా రైతులతోనే'

వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులతో కలిసి చివరి వరకు పోరాడతామన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. చట్టాలను ఉపసంహరించేంత వరకు పోరాటం విరమించేది లేదని మేరఠ్​ సభలో తెలిపారు.

Congress with farmers till last to repeal laws, saya priyanka gandhi
'చట్టాల రద్దు కోసం చివరిదాకా రైతులతోనే కాంగ్రెస్'
author img

By

Published : Mar 7, 2021, 6:53 PM IST

మరో వంద నెలల పట్టినా సాగు చట్టాల రద్దు కోసం రైతులతో కలసి పోరాడతామన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో ఏర్పాటు చేసిన కిసాన్ మహాపంచాయత్​లో ఆమె పాల్గొన్నారు.

"100 రోజులు గడిచింది. నమ్మకం కోల్పోవద్దు. ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవడానికి మరో 100 వారాలు లేదా 100 నెలలు పట్టినా మీతో పాటు మేం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం."

- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

వ్యవసాయ చట్టాలు దేశంలోని ఇద్దరు వ్యక్తుల లబ్ధి కోసమేనని ప్రియాంక విమర్శించారు. చట్టాలు రద్దు చేసేంతవరకు పోరాడాలని, చివరి వరకు కర్షకులకు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: 'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.