- " class="align-text-top noRightClick twitterSection" data="">
Congress, Telangana Assembly Election Results 2023 Live News : శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఇవాళ వీడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించి అరగంట అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. గరిష్ఠంగా జూబ్లీహిల్స్‌లో 26 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పదిన్నర ప్రాంతంలో మొదటి ఆధిక్యం తెలిసే అవకాశాలు ఉన్నాయి.
Congress Alert on Telangana Election Results 2023 : రాష్ట్ర శానససభ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కేసీఆర్ స్వయంగా తమతో మాట్లాడుతున్నారని తమ అభ్యర్థులే చెబుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తొలుత ఎమ్మెల్యే అభ్యర్థులందరనీ హైదరాబాద్ రప్పించాలని భావించారు. పార్టీ అగ్ర నేతలతో మాట్లాడాక వ్యూహం మార్చారు. ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే సమక్షంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాస్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్తలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.
రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ పెట్టారేమో : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
అందుకు ఈసీ అంగీకారం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అభ్యర్థులంతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండి జాగ్రత్తగా పరిశీలించాలని స్పష్టం చేశారు. పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరగకుండా అభ్యర్థులు గట్టి నిఘా పెట్టాలని, పార్టీ ఏజెంట్లను అప్రమత్తంగా ఉంచాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు అభ్యర్థులకు కాకుండా ముఖ్య కౌంటింగ్ ఏజెంట్లకు ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఈసీ అంగీకారం తెలిపింది.
కాయ్ రాజా కాయ్ - కామారెడ్డి ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు
ఫలితం తేలగానే హైదరాబాద్‌కు తరలింపు: ఇక పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించేందుకు డీకే శివకుమార్ శనివారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ చేరుకున్నారు. శివకుమార్‌తో పాటు మంత్రులు బోసురాజు, జార్జ్, ప్రత్యేక పరిశీలకులు రమేశ్ చిన్నితల, మురళీధరన్, దీపాదాస్ మున్సీను కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యకలాపాల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఫలితాలు వచ్చాక గెలిచిన అభ్యర్థులందరినీ హైదరాబాద్ తరలించేలా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 49 మంది పరిశీలకుల్ని ఏఐసీసీ నియమించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది : రాబర్ట్ వాద్రా
అభ్యర్థులెవరూ కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటకు రావొద్దు - రాహుల్ గాంధీ కీలక ఆదేశాలు