ETV Bharat / bharat

ఖర్గే X థరూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​.. ఓటేసిన సోనియా, రాహుల్​

Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్​లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ​9వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

author img

By

Published : Oct 17, 2022, 10:03 AM IST

Updated : Oct 17, 2022, 5:47 PM IST

congress president election
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్​లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.

congress president election
ఓటు వేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
congress president election
ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటు వేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి.. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. మరోవైపు, అధ్యక్ష బరిలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

congress president election
ఓటు వేసేందుకు లైన్​లో ఉన్న రాహుల్ గాంధీ

దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరిగింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశిథరూర్.. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకునున్నారు.

ఇవీ చదవండి: భాజపా X ఆప్​ X కాంగ్రెస్..​ గుజరాత్‌ బరిలో 'త్రిముఖ' వ్యూహాలు

కోతులకు సొంత భూమి.. గ్రామంలో 32 ఎకరాలు వాటి పేరు మీదే!

Last Updated : Oct 17, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.