ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ఇప్పట్లో లేనట్లే, కారణం ఇదే - congress president election 2022

Congress President Election కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికపై సందిగ్ధం కొనసాగుతోంది. సెప్టెంబర్​ 21 కల్లా పార్టీకి కొత్త అధ్యక్షుడు రావాల్సి ఉండగా ఇప్పుడు ఆ గడువును మరో నెల పొడిగించినట్లు తెలుస్తోంది. ఎన్నిక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Congress President Election
Congress President Election likely to be postponed
author img

By

Published : Aug 26, 2022, 7:17 AM IST

Congress President Election: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక కొద్ది వారాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'భారత్‌ జోడో యాత్ర'పై పార్టీ దృష్టి పెట్టడంతో పాటు, కొన్ని రాష్ట్రాల పార్టీ విభాగాలు అవసరమైన ప్రక్రియను ఇంకా పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఆదివారం.. పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక మరింత లేట్​ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నూతన అధ్యక్ష ఎన్నిక ఈ ఏడాది ఆగస్టు 21- సెప్టెంబరు 20 మధ్య జరుగుతుందని గత ఏడాది అక్టోబరులో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కాగా ఎన్నిక ప్రక్రియ కొంత ఆలస్యం కావొచ్చని, అక్టోబరు నాటికి పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ పదవిని చేపట్టేందుకు ఒకవైపు అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు పండగల ముందు ఇది సరైన కాలం కాదని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. తర్వాత ఇటలీ వెళ్తారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లిని పరామర్శించనున్నారు. ఈ మొత్తం పర్యటనలో సోనియా వెంట రాహుల్, ప్రియాంక గాంధీ ఉంటారు. దీంతో పార్టీ కార్యకలాపాలు, ఎన్నిక గురించి చర్చించేందుకు సీడబ్ల్యూసీగా వర్చువల్‌గా సమావేశం కానుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూడటంతో దానికి బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవిని వీడారు. అప్పటి నుంచి ఆ పదవిని చేపట్టడానికి సుముఖంగా లేరు. సోనియా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఈ ముగ్గురు గాంధీలు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉంటే.. ఆ పీఠం మీద కూర్చునే వ్యక్తి ఎవరనే సందిగ్ధం అలాగే ఉండిపోయింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ పేరు వినిపించినా.. ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు.

ఇవీ చూడండి: సందిగ్ధంలో రాహుల్‌, అధ్యక్ష పదవిపై నో క్లారిటీ

కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ సీఎం, ఎంతవరకు నిజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.