ETV Bharat / bharat

'గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రతిష్ఠాపన మహాపాపం- శంకరాచార్యుల సూచన పట్టించుకోరా?' - congress opposed ram mandir

Congress On Ram Temple Opening : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయాన్ని ప్రారంభించటం మహాపాపమని పేర్కొంది. మరోవైపు, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకాకపోవడంపై బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఇది అహంకారమేనని విమర్శించారు.

Congress On Ram Temple Opening
Congress On Ram Temple Opening
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 2:05 PM IST

Updated : Jan 12, 2024, 3:00 PM IST

Congress On Ram Temple Opening : అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ధర్మశాస్త్రాలు, విధివిధానాల ప్రకారం జరగటం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. ఈ మహాక్రతువును భారతీయ జనతా పార్టీ ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని మండిపడింది. నిర్మాణం పూర్తికాకుండా ఆలయాన్ని ప్రారంభించటం మహాపాపమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు చెబితే వారిని పక్కనపెట్టారని తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీని పంచాంగం చూడకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారని పవన్ ఖేడా ఆరోపించారు.

  • एक पूरा संगठन मेरे धर्म का ठेकेदार बनाकर बैठा है, इनकी पूरी IT सेल चारों पीठों के शंकराचार्यों के खिलाफ एक मुहीम छेड़कर बैठी है।

    इस पूरे आयोजन में कहीं भी धर्म, नीति और आस्था नहीं दिखाई दे रही, सिर्फ राजनीति दिखाई दे रही है।

    मंदिर की प्राण प्रतिष्ठा के लिए 22 जनवरी की तारीख का… pic.twitter.com/oAzMaSupHu

    — Congress (@INCIndia) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆలయ ప్రాణప్రతిష్ఠకు కొన్ని విధివిధానాలు ఉంటాయి. ఇది ధార్మిక కార్యక్రమం అయితే విధివిధానాలు, ధర్మశాస్త్రాల ప్రకారం జరుగుతోందా? నాలుగు పీఠాల శంకరాచార్యుల సలహాలు, మార్గనిర్దేశం ప్రకారం ఈ క్రతువు నిర్ణయించారా? ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ జరపకూడదని నాలుగు పీఠాల శంకరాచార్యులు స్పష్టం చేశారు. ఇది ధార్మిక కార్యక్రమం కానప్పుడు రాజకీయ కార్యక్రమమే అవుతుంది. ఓ రాజకీయ కార్యక్రమంలో మాకు, మా దేవుని మధ్య రాజకీయ పార్టీ కార్యకర్త మధ్యవర్తిగా ఉంటే మేం వారిని ఎందుకు భరించాలి? ఇంతకుమించిన పాపం లేదు. రామాలయ ప్రారంభోత్సవాన్ని 22వ తేదీన నిర్ణయించారు. బీజేపీ ఏ పంచాంగం చూసి ఆ తేదీ నిర్ణయించింది? ఆ తేదీని ఎంపిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖరారు చేశారు?" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్​ ఖేడా ఆరోపించారు.

'మతం అనేది వ్యక్తిగత విశ్వాసం'
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. 'రామాలయం ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని మా పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇది సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని నేను నమ్ముతాను. అందులో రాజకీయాలను కలపకూడదు. కానీ భారతదేశంలో మతాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం.' అని కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు.

  • #WATCH | On Congress party's stand on Ram Temple pranpratistha ceremony, party MP Karti Chidambaram says, "It is a matter of personal faith but I stand by the decision taken by my party. I think it is the right decision and I support the decision taken by the Congress party...I… pic.twitter.com/qkceMSm6G2

    — ANI (@ANI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'బీజేపీ కులమతాల ఆధారంగా విభజిస్తోంది'
బీజేపీ ప్రజలను కులం, మతం, భాషల వారీగా విభజించిందని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం హెడ్ సుప్రియా శ్రీనాతే అన్నారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విశ్వాసాన్ని అత్యున్నతమైనదిగా పరిగణిస్తుందని చెప్పారు. మరోవైపు, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని కేరళలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ తెలిపారు. బీజేపీ, సంఘ్‌ పరివార్‌ రాజకీయం చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

'కాంగ్రెస్​ది అహంకారం'
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ హాజరుకాకపోవడంపై బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. 'ఇది వారి అహంకారం మాత్రమే. ఇందులో కొత్తేమీ లేదు. వారు పార్లమెంటు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించారు. అందుకే ప్రజలు కూడా కాంగ్రెస్​ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే వారు అలాంటి పరిస్థితిలో ఉన్నారు.' అని నఖ్వీ తెలిపారు.

  • VIDEO | "This is just their arrogance. There is nothing new in it. They boycotted Parliament, Constitution, Democracy. People have also decided to boycott them and that is why they are in such a situation. They are frustrated that the matter, which they kept delaying by creating… pic.twitter.com/fKpCfW4Lr4

    — Press Trust of India (@PTI_News) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'రామమందిరంతో బీజేపీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్- కౌంటర్ వ్యూహాలపై 'ఇండియా' ఫోకస్​'

నాలుగేళ్ల బాలిక బ్రెయిన్ డెడ్- చనిపోతూ ఇద్దరికి పునర్జన్మ!

Last Updated : Jan 12, 2024, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.