ETV Bharat / bharat

'ప్రజల్ని మభ్యపెట్టొద్దు.. పెట్రోల్ రేట్లను యూపీఏ స్థాయికి చేర్చండి'

author img

By

Published : May 22, 2022, 4:28 AM IST

CONGRESS ON PETROL TAX CUT: పెట్రోల్​పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం.. కేంద్ర ప్రభుత్వ అంకెల గారడీలో భాగమని కాంగ్రెస్ విమర్శించింది. పెట్రోల్ ధరను భారీగా పెంచి.. కొంతవరకే సుంకం తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రజలను మోసం చేయడం ఆపాలని డిమాండ్ చేసింది.

CONGRESS ON PETROL
CONGRESS ON PETROL

CONGRESS ON PETROL TAX CUT: పెట్రోల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు వ్యక్తం చేసింది. ప్రజలకు నిజమైన ఉపశమనం అవసరమని, అంకెల గారడీ కాదని పేర్కొంది. పెట్రోల్​పై 60 రోజుల్లో రూ.10 ధర పెంచి... ఇప్పుడు రూ.9.50 తగ్గించారని మండిపడింది. దమ్ముంటే పెట్రోల్, డీజిల్​పై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని యూపీఏ ప్రభుత్వం ఉన్న 2014 మే స్థాయికి తీసుకురావాలని డిమాండ్ చేసింది.

"ఆర్థికమంత్రి గారూ... 60 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్​ ధరను రూ.10 పెంచారు. ఇప్పుడు రూ.9.50 తగ్గించారు. డీజిల్ ధరను రూ.10 పెంచి.. ఇప్పుడు రూ.7 తగ్గించారు. ప్రజలను మోసం చేయడం ఆపండి. 2014 మేలో లీటర్ పెట్రోల్​పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది రూ.19.90గా ఉంది. డీజిల్​పై అప్పట్లో రూ.3.56 ఎక్సైజ్ డ్యూటీ ఉంటే.. ఇప్పుడది రూ.15.80 ఉంది. దేశానికి మీ అబద్దాలు, అంకెల గారడీ అవసరం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసుకోండి."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి

పెట్రోల్​పై కేంద్రం సెస్సులు విధించి రాష్ట్రాలకు నిధులు అందకుండా చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. వాటిని తగ్గిస్తేనే నిజమైన ఉపశమనం ఉంటుందని అన్నారు. ఇప్పుడు పెట్రోల్​పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కోరడం.. పూర్తిగా అర్థం లేని వాదన అని పేర్కొన్నారు. మరోవైపు, పెట్రోల్ ధరలపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగానే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధనికులను ఆదుకొని, పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రకటన అహంకార పూరితంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

Petrol Excise duty UPA: కాగా, పెట్రోల్​పై తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ సరిపోదని, ఏడేళ్ల క్రితం ఏ స్థాయిలో ఉందో అక్కడికి తీసుకురావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. 'రెండు నెలల క్రితమే పెట్రోల్​పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్​కు రూ.18.42 పెంచారు. ఇప్పుడు రూ.8 తగ్గించారు. డీజిల్​పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.24 పెంచి.. ఇప్పుడు రూ.6 తగ్గించారు. ఒక్కసారిగా భారీగా పెంచి.. మోస్తరుగా తగ్గించడం సమంజసం కాదు' అని అన్నారు ఠాక్రే.

కేంద్రం నిర్ణయం భేష్:
పెట్రోల్ ధరలు తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీపై కోత విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం పెట్రోల్​పై పన్నులు తగ్గించాలని పిలుపునిచ్చారు. గత నవంబర్​లో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పుడు.. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని గుర్తు చేశారు.

Kerala reduces petrol tax:
మరోవైపు, ఇంధనంపై వ్యాట్​ను తగ్గిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్​పై రూ.2.41, డీజిల్​పై రూ.1.36 మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పాక్షికంగానే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. అయినా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ పేర్కొన్నారు.

రైతులకు రిలీఫ్...:
ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలైజర్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ధరల మంట నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని అందించనున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో 2022-23 ఏడాదికి రైతులకు ఎరువులపై అందించే సబ్సిడీ రూ.2.15 లక్షల కోట్లకు చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్నా.. దేశంలోని రైతులపై ఆ భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రైతులకు మరింత ఉపశమనం కలిగించేందుకు బడ్జెట్‌లో లక్షా 5 వేల కోట్ల ఎరువుల సబ్సిడీతోపాటు.... లక్షా 10 వేల కోట్ల అదనపు మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. యూరియా, పొటాసిక్, ఫాస్ఫేటిక్ ఎరువులను భారత్‌ దిగుమతి చేసుకుంటుండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా వీటి ధరలు పెరిగాయి. దీని ప్రభావం ధరలపై పడకుండా కేంద్ర సబ్సిడీ పెంచింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.