ETV Bharat / bharat

కాంగ్రెస్​ కోసం 'టాస్క్​ఫోర్స్​'.. మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ!

Congress news: 2024 ఎన్నికల ముందు దేశంలో మళ్లీ పట్టుసాధించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్​.. అందుకు అవసరమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. జీ-23 నేతలు సహా కాంగ్రెస్​ సీనియర్ నేతలు వీటిలో సభ్యులుగా ఉన్నారు.

కాంగ్రెస్
కాంగ్రెస్
author img

By

Published : May 24, 2022, 2:54 PM IST

Congress news: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వివిధ అంశాలపై పార్టీ నేతలు సమాంతరంగా పని చేసేలా మూడు గ్రూపులను ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవహారాలకు ఓ గ్రూప్​, పార్టీ సంస్కరణలపై ఇటీవల చింతన్​శిబిర్​లో తీసుకున్న 'నవసంకల్ప్​' నిర్ణయం అమలుకు ఓ బృందాన్ని​, 'భారత్​ జోడో యాత్ర' బాధ్యతలు మరో బృందానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందాల్లో సీనియర్​ కాంగ్రెస్ నేతలు సహా జీ-23 నాయకులు కూడా ఉన్నారు.

సోనియా ఆధ్వర్యంలోని పార్టీ వ్యవహారాల బృందంలో రాహుల్​ సహా జీ23 నేతలైన గులామ్​ నబీ ఆజాద్, ఆనంద్​ శర్మ ఉన్నారు. వీరితో పాటు మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్​ బృందంలో భాగం. టాస్క్​ఫోర్స్​-2024 పేరుతో 'నవసంకల్ప్​' కోసం ఏర్పాటు చేసిన బృందంలో సీనియర్​ నేతలు పి.చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా సహా ముకుల్​ వాస్నిక్​, జైరామ్​ రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్​ మేకన్, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, సునీల్​ కనుగోలు సభ్యులుగా ఉన్నారు. ఇక భారత్​ జోడో యాత్ర కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్​ ప్లానింగ్​ గ్రూప్​లో.. సచిన్​ పైలట్, దిగ్విజయ సింగ్, శశిథరూర్, రవ్​నీత్​ సింగ్ బిట్టు, కేసీ జార్జ్​, జోతిమణి, ప్రద్యుత్​ బోర్దోలోయ్​, జితు పట్వారీ సహా సలీమ్​ అహ్మద్​ ఉన్నారు. 'భారత్​ జోడో యాత్ర'లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు కాంగ్రెస్​ నేతలు పర్యటించనున్నారు. గాంధీ జయంచి సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్​ ప్రణాళికలు రచిస్తోంది.

ఇదీ చూడండి : 'కొత్త మంత్రి'పై సీఎం వేటు.. వెంటనే అరెస్ట్.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.