ETV Bharat / bharat

'అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు.. తెలంగాణ, యూపీ ఓట్లపై డౌట్స్​'.. థరూర్​ సంచలన ఆరోపణ - shashi tharoor updates

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్​ మధుసూదన మిస్త్రీకి ఆయన తరఫున ఎన్నికల ఏజెంట్​గా ఉన్న సల్మాన్​ సోజ్​​ లేఖ రాశారు.

congress mp shashi tharoor wrote letter to madhusudhan mistry

author img

By

Published : Oct 19, 2022, 12:42 PM IST

Updated : Oct 19, 2022, 1:09 PM IST

దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న వేళ.. ఈ పదవికి పోటీ చేసిన ఆ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. యూపీలో పోలైన ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ మేరకు థరూర్‌ తరఫున ఎన్నికల ఏజెంట్​గా ఉన్న సల్మాన్​ సోజ్.. కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్​ మధుసూదన మిస్త్రీకి లేఖ రాశారు. పంజాబ్​తో పాటు తెలంగాణలో పోలైన పలు ఓట్లపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.

"పోలింగ్‌ సమయంలో ఉత్తర్​ప్రదేశ్‌లో తీవ్ర అవకతవకలు జరిగాయి. దీని గురించి మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. అందుకే ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో విశ్వసనీయత, సమగ్రత లోపించడం విచారకరం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. ఆ రాష్ట్రంలో బ్యాలెట్‌ బాక్సులకు అధికారిక సీల్‌ వేయలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అనధికారిక వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా ఎలా జరిగినట్లు అవుతుంది? అందువల్ల ఆ రాష్ట్రంలోని ఓట్లన్నింటినీ చెల్లనివిగా పరిగణించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం" అని థరూర్‌ తరఫున ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న సల్మాన్‌ సోజ్‌ లేఖలో పేర్కొన్నారు.

congress mp shashi tharoor wrote letter to madhusudhan mistry
లేఖ

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. బ్యాలెట్లను కలగలిపి కట్టలు కట్టిన అనంతరం ఓట్లు లెక్కిస్తున్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే బ్యాలెట్ పెట్టెలను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచారు.

అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున ఖర్గే కౌంటింగ్‌ ఏజెంట్లుగా ప్రమోద్ తివారీ సహా మరో ఆరుగురు ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్నారు. శశిథరూర్‌కు ఏజెంట్లుగా కార్తీ చిదంబరం, అతుల్ చతుర్వేది, సుమేద్ గైక్వాల్ ఉన్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో..తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు ఎవరో తేలనుంది.

ఇవీ చదవండి: 'అప్పట్లో పావురాలు వదిలేవారు.. ఇప్పుడు చీతాలను వదులుతున్నాం'

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం.. కిరాతకంగా చంపి.. కృష్ణానదిలో పడేసి..

Last Updated : Oct 19, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.