కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ నైనీతాల్లోని ఆయన ఇంటిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. ఈ ఘటనలో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు డీజీఐ నీలేశ్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
- — Salman Khurshid (@salman7khurshid) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Salman Khurshid (@salman7khurshid) November 15, 2021
">— Salman Khurshid (@salman7khurshid) November 15, 2021
ఖుర్షీద్ ఇటీవల రాసిన 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య- నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్' పుస్తకం.. ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ పుస్తకం రాశారని కొందరు ఆరోపిస్తున్నారు.