ETV Bharat / bharat

జైలు శిక్షపై కోర్టులో రాహుల్ పిటిషన్.. బెయిల్ పొడగింపు.. తదుపరి విచారణ అప్పుడే - సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

సూరత్​ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ పొడగించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 13న తదుపరి విచారణ జరపనున్నట్లు స్పష్టం చేసింది.

congress leader Rahul Gandhi
congress leader Rahul Gandhi
author img

By

Published : Apr 3, 2023, 2:50 PM IST

Updated : Apr 3, 2023, 3:59 PM IST

నేరపూరిత పరువు నష్టం కేసులో గుజరాత్​లోని సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత సోమవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 13 వరకు బెయిల్​ను పొడగించింది. అదే రోజు తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మొదటిది రెగ్యులర్ బెయిల్ కోసం కాగా.. దోషిగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 13న రాహుల్ ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రెండో పిటిషన్​లో రాహుల్​కు అనుకూలంగా తీర్పు వస్తే.. లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది. రాహుల్ వెంట సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుఖ్విందర్ సుఖు(హిమాచల్), భూపేశ్ బఘేల్(ఛత్తీస్​గఢ్), అశోక్ గహ్లోత్​(రాజస్థాన్)లు సూరత్ కోర్టుకు వచ్చారు.

congress leader Rahul Gandhi
ఎయిర్​పోర్ట్​లో రాహుల్​కు స్వాగతం పలుకుతున్న అశోక్ గహ్లోత్

కోర్టులపై ఒత్తిడి చేస్తున్నారు: బీజేపీ
కాంగ్రెస్ అగ్రనేతలంతా కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో బీజేపీ మాటల దాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే ఒక కుటుంబమే ముఖ్యమని బీజేపీ ఎద్దేవా చేసింది. న్యాయ ప్రక్రియకు ఓ పద్ధతి ఉంటుందని, న్యాయస్థానాలపై ఒత్తిడి తెచ్చేందుకే పార్టీ నేతలు భారీగా సూరత్​కు చేరుకుంటున్నారని విమర్శించింది. ఒక రాజకీయ పార్టీ మొత్తం కోర్టును ఘెరావ్ చేయడానికి ప్రయత్నించిన సందర్భం గతంలో ఎప్పుడైనా చూశామా అని కేంద్ర న్యాయ శాఖమంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. 'మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దోషిగా తేలినప్పుడు కాంగ్రెస్ నిశ్శబ్దంగా ఉంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, డీకే శివకుమార్​ బెయిల్​పై ఉన్నప్పుడు కూడా మద్దతు తెలపలేదు' అని రిజిజు అన్నారు.

'మేమంతా రాహుల్ వెంటే'
బీజేపీ విమర్శలను హస్తం శ్రేణులు కొట్టిపారేశారు. ఇదేమీ రాజకీయ డ్రామా కాదని స్పష్టం చేశారు. తాము కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమని.. తమ పార్టీలో రాహుల్‌గాంధీ అగ్రనాయకుడని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌ సుఖు పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంట ఉంటామని తేల్చి చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
congress leader Rahul Gandhi
రాహుల్​కు ఘన స్వాగతం

రాహుల్​ గాంధీకి మద్దతుగా సూరత్​ వెళ్తున్న కార్యకర్తలు, పార్టీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ అప్రజాస్వామిక పాలన మళ్లీ బట్టబయలవుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. కార్యకర్తల అరెస్టును ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్‌ ట్రయల్ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే రాహుల్​కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం... తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ తీర్పు రాగానే లోక్​సభ సచివాలయం కూడా తక్షణమే స్పందించి రాహుల్​పై అనర్హత వేటు వేసింది. ఇటీవలే ఆయన నివసిస్తున్న అధికారిక భవనాన్ని కూడా ఈ నెల 22లోపు ఖాళీ చేయాలని ఆదేశించింది.

Last Updated : Apr 3, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.