ETV Bharat / bharat

సోనియాతో ఆజాద్​ భేటీ.. 'ఐక్య పోరాటం'పై చర్చ! - 10 జన్​పథ్​

Sonia Ghulam Nabi Azad meet: కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటం సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు ఆజాద్​.

Ghulam Nabi Azad
సోనియాతో గులాం నబీ ఆజాద్​ భేటీ
author img

By

Published : Mar 18, 2022, 6:06 PM IST

Updated : Mar 18, 2022, 8:20 PM IST

Sonia Gandhi Ghulam Nabi Azad meet: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​.. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయం, జీ23 నేతల సమావేశం, గాంధీల నాయకత్వ మార్పు వంటి అంశాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోనియాతో ఆజాద్​ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటం సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు ఆజాద్​.

"సోనియా గాంధీతో సమావేశం సానుకూలంగా సాగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి, ప్రత్యర్థి పార్టీలపై ఐక్యంగా పోరాడటంపై చర్చించాం. ఈ భేటీ మీడియాకు వార్త కావొచ్చేమో కానీ ఇది సాధారణ సమావేశమే. సోనియాతో భవిష్యత్తులోనూ సమావేశాలు ఉంటాయి. పార్టీని బలోపేతం చేయటంపై పార్టీ నేతలతో సోనియా చర్చలు జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం వర్కింగ్​ కమిటీ సమావేశమై పార్టీని ఏ విధంగా బలోపేతం చేయవచ్చని సూచనలు కోరింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అడిగింది. నా సూచనలను సైతం చెప్పాను. "

- గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఎలాంటి సూచనలు చేశారని విలేకరులు ప్రశ్నించగా.. అన్నింటిని గుర్తుంచుకోవటం సాధ్యం కాదని సమాధానమిచ్చారు ఆజాద్​. పార్టీని పునర్​వ్యవస్థీకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జీ-23 నేతలు సమావేశమైన మరుసటి రోజునే సోనియాతో ఆజాద్​ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జీ23 నేతల ప్రతిపాదనలు..

పార్టీ బలోపేతం కావాలంటే ప్రతిస్థాయిలో సమష్టి, సమ్మిళిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు జీ23 నేతలు. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దెదించాలంటే కాంగ్రెస్​ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్ఠానం చర్చలు జరిపి కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ భేటీ​లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి గల మార్గాలపై నేతలు చర్చించారు.

ఇదీ చూడండి: మరోసారి జీ23 నేతల సమావేశం.. హుడాతో రాహుల్​ భేటీ

Last Updated : Mar 18, 2022, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.