అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం.. ఓ డిజిటల్ మీడియా ఛానెల్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. తమ పార్టీ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే ఈ ఛానెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్ ఈ ఛానెల్‌ను ప్రారంభించారు.
ఏప్రిల్ 24 నుంచి..
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవమైన ఏప్రిల్ 24 నుంచి ఐఎన్‌సీ టీవీ ఛానెల్లో ప్రసారాలు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ తెలిపింది. తొలుత ఇంగ్లీష్, హిందీతో ప్రారంభించి భవిష్యత్తులో ప్రాంతీయ భాషల్లోనూ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు చెప్పింది. ఈ ఛానెల్‌కు టీవీ జర్నలిస్టు భూపేంద్ర నారాయణ్ సింగ్ అధిపతిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై కాంగ్రెస్ ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఇదీ చూడండి:' విద్వేషాన్ని పెంచుతున్న భాజపా, ఆర్‌ఎస్‌ఎస్'
ఇదీ చూడండి:'వారికి కాషాయం ప్రాముఖ్యత తెలియదు'