ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్. ఇప్పటికే అసోం ఎన్నికల కోసం స్క్రీనింగ్ కమిటీని నియమించగా.. తాజాగా మిగతా నాలుగు రాష్ట్రాలకూ ఏర్పాటు చేసింది. బంగాల్లో ఎనిమిది దశల్లో జరగబోయే ఎన్నికలకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి దిల్లీ కాంగ్రెస్ నాయకుడు జేపీ అగర్వాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో మహేశ్ జోషి, నసీమ్ఖాన్లను సభ్యులుగా చేర్చినట్టు ఆ పార్టీ తెలిపింది.
బంగాల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఇన్-ఛార్జ్‌గా జితిన్ ప్రసాద్‌ను నియమించిన కాంగ్రెస్.. పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, సీఎల్పీ నేత అబ్దుల్ మన్నన్లకు కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.
294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్లో.. ఎనిమిది దశల్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)లతో సంకీర్ణంగా బరిలోకి దిగుతోంది కాంగ్రెస్. 92 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ సంక్షోభం: జీ23 దూకుడు- అధిష్ఠానం మౌనం!
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో..
కేరళకు హెచ్‌కే పాటిల్‌ను ఛైర్మన్‌గా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. తమిళనాడు సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కలిపి ఒకే కమిటీని నియమించి.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.


ఆయా రాష్ట్రాల్లో నియమించిన ఈ కమిటీలు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను పరిశీలించి.. సోనియా గాంధీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేస్తారు.
ఇదీ చదవండి: అసోం ఎన్నికల కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ