ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పుపై జోరుగా ప్రచారం(chhattisgarh cm change) జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం భూపేశ్ బఘేల్‌ను(cg cm bhupesh baghel) ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా(up polls 2022) నియమించింది. అసోం శాసనసభ ఎన్నికల సమయంలో.. తన బృందంతో కాంగ్రెస్ శ్రేణులకు బూత్ స్థాయి శిక్షణ ఇవ్వటంలో కీలకపాత్ర పోషించిన బఘేల్.. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల అంశంపై ఇదివరకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంక గాంధీతో చర్చలు జరిపారు.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ(congress president).. ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల(UP Polls 2022) సీనియర్ పరిశీలకుడిగా బఘేల్‌ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.
-
माननीय राष्ट्रीय अध्यक्षा श्रीमती सोनिया गांधी जी ने उत्तरप्रदेश विधानसभा चुनाव के लिए मुझे पर्यवेक्षक होने का निर्देश दिया है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
बड़ी ज़िम्मेदारी है। पूरा प्रयास रहेगा कि शीर्ष नेतृत्व की उम्मीदों पर खरा उतर सकूं।
परिवर्तन का संकल्प, कांग्रेस ही विकल्प pic.twitter.com/JpNqqCdcP9
">माननीय राष्ट्रीय अध्यक्षा श्रीमती सोनिया गांधी जी ने उत्तरप्रदेश विधानसभा चुनाव के लिए मुझे पर्यवेक्षक होने का निर्देश दिया है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 2, 2021
बड़ी ज़िम्मेदारी है। पूरा प्रयास रहेगा कि शीर्ष नेतृत्व की उम्मीदों पर खरा उतर सकूं।
परिवर्तन का संकल्प, कांग्रेस ही विकल्प pic.twitter.com/JpNqqCdcP9माननीय राष्ट्रीय अध्यक्षा श्रीमती सोनिया गांधी जी ने उत्तरप्रदेश विधानसभा चुनाव के लिए मुझे पर्यवेक्षक होने का निर्देश दिया है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 2, 2021
बड़ी ज़िम्मेदारी है। पूरा प्रयास रहेगा कि शीर्ष नेतृत्व की उम्मीदों पर खरा उतर सकूं।
परिवर्तन का संकल्प, कांग्रेस ही विकल्प pic.twitter.com/JpNqqCdcP9
"ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సీనియర్ పరిశీలకుడిగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదేశించారు. అధిష్ఠానం అంచనాలను చేరుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. 'పరిష్కారం అనేది మార్పు, దానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్'"
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి.
కొత్త బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో బఘేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజక్ కుమార్ లాలూ. ఆయన మార్గదర్శనంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్లో మార్పులు..
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్‌లోనూ పలు మార్పులు చేసింది అధిష్ఠానం. నాలుగు జిల్లాలకు కొత్త సారథులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సమాచార విభాగం అధ్యక్షులను నియమించింది.
ఇదీ చూడండి: దిల్లీకి ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేల క్యూ.. సీఎం ఏమన్నారంటే?