ETV Bharat / bharat

కాంగ్రెస్ ఎంపీపై సింఘు సరిహద్దు వద్ద దాడి - luthiana mp congress assaulted

సింఘు సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీ రవ్​నీత్ సింగ్ బిట్టుపై దాడి జరిగింది. కొందరు దుండగులు ఆయన టర్బైన్​ను లాగేసి దాడి చేశారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

cong mp luthiana assault
కాంగ్రెస్ ఎంపీపై సింఘు సరిహద్దు వద్ద దాడి
author img

By

Published : Jan 25, 2021, 6:56 AM IST

లూథియానా కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్‌ బిట్టుపై కొందరు ఆగంతుకులు సింఘు సరిహద్దు వద్ద దాడికి తెగపడ్డారు. ఆయన టర్బైన్‌ను లాగేశారు. బిట్టు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

సింఘు సరిహద్దు వద్ద రవ్​నీత్ సింగ్

గురుతేగ్​ బహదూర్‌ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సహచర ఎంపీ గుర్‌జీత్‌ సింగ్‌ ఔజ్లాతో కలిసి వచ్చారు బిట్టు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. కర్రలు, ఆయుధాలతో కొందరు ఒక్కసారిగా తమపై దాడికి తెగపడ్డారని ఎంపీ తెలిపారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని చెప్పారు. తమలో ఒకరిని చంపేందుకే ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దాడి తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయామని వివరించారు.

అయితే ఈ విషయంపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు మాత్రం ఇవ్వలేదు. జరిగిన ఘటన వివరాలను ఫేస్‌బుక్ ద్వారా బిట్టు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.