ETV Bharat / bharat

మిత్ర పక్షాల అండతో విజయంపై 'హస్తం' ​గురి!

సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన అనుభవం ఉన్న కాంగ్రెస్​ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస ఓటములు, అంతర్గత విభేదాలతో సతమవుతోంది. ఈ పరిస్థితుల్లో త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తన సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం తన మిత్రపక్షాల సాయాన్ని కోరుతోంది. మరి ఈసారైనా 'హస్తం పార్టీ' పూర్వ వైభవం దక్కించుకుంటుందా?

author img

By

Published : Feb 28, 2021, 9:02 AM IST

congress with the help of allies
మిత్ర పక్షాల అండతో ఎన్నికల్లో విజయంపై 'హస్తం' ​గురి!

వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్​.. ఇటీవల వరుస పరాభవాలతో చతికిలపడింది. దానికి తోడు నాయకత్వ లేమి, అసమ్మతి గళాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేరళ, తమిళనాడు, అసోం, బంగాల్​, పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. ఈ సారి ఎలాగైనా.. మిత్ర పక్షాల అండతో ఆయా ప్రాంతాల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. అసోం సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే.. ఆ పార్టీ ఇంకా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు అంశాన్ని తేల్చుకోవాల్సి ఉంది.

  • తమిళనాడులో తన ప్రధాన భాగస్వామి అయిన డీఎంకేతో సీట్ల పంపకం పనుల్లో కాంగ్రెస్​ నిమగ్నమైంది.
  • ప్రతి ఐదేళ్లకు అధికారాన్ని మార్చేసే కేరళలో ఈ సారి తాము తప్పక గెలుస్తామన్న ఆశాభావంతో కాంగ్రెస్​ అడుగులు వేస్తోంది.
  • అసోంలో భాజపాను అధికారం నుంచి విముక్తి చేసేందుకు ఏఐయూడీఎఫ్​ మిత్రపక్షంతో కాంగ్రెస్​ చేతులు కలిపింది. గత ఏడాది నవంబర్‌లో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ వంటి ఆకర్షణీయమమైన నేత ప్రస్తుతం ఆ పార్టీకీ లేనప్పటికీ.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తిమేర ప్రయత్నాలు చేస్తోంది.
  • బంగాల్​లో ఇండియా సెక్యులర్​ ఫ్రంట్​తో కాంగ్రెస్​ సహా వామపక్షాలు అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. భాజపా వ్యతిరేక పోరులో ఏఐఎంఐఎం, టీఎంసీలతో విసుగు చెందిన మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్​కు ఈ పొత్తు ఉపకరిస్తుంది.

పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో మాత్రమే కాంగ్రెస్ ప్రస్తుతం​ అధికారంలో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్​లో మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సత్తా చాటి దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను సుస్థిరం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

లెక్క తేలినప్పుడే..

2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్​, ఇటీవల పుదుచ్చేరిలో కాంగ్రెస్​ ప్రభుత్వాలు పతనమయ్యాయి. పంజాబ్​ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ.. గుజరాత్​ స్థానిక పోరులో మళ్లీ దెబ్బతింది. దాంతో పాటు బిహార్​, దిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలు ఆ పార్టీని ప్రమాదంలో పడేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ పూర్తి స్థాయి అధ్యక్ష పదవీ బాధ్యతలు ఎవరూ చేపట్టకపోగా.. మిత్రపక్షాలతో సీట్ల పంపిణీల్లో చాలా నష్టాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియను నిర్దుష్టంగా పూర్తి చేసి, రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

మోదీని ఎదుర్కొనేందుకు..

కేరళ, అసోం, బంగాల్​, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్​ నుంచి అసమ్మతి గొంతు వినిపించిన 23 మంది నేతలు శనివారం మరోసారి.. ప్రజల ముందు తమ వాణి వినిపించారు. కాంగ్రెస్​ పార్టీ బలహీనంగా మారిందన్న వారు.. తొందరగా పునరుత్తేజం సాధించాలని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపాకు గట్టి పోటీదారుగా నిలవడానికి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్​కు అత్యంత అవసరం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తద్వారా.. 2022లో జరగనున్న ఉత్తరాఖండ్​, పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శన ఇవ్వొచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి:భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.