corona death compensation: కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్.. తాజాగా ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. "#SpeakUpforCovidNyay" పేరిట దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఓ పక్క ప్రజలు కష్టాలను అనుభవిస్తుంటే.. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని' ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు.
"దేశంలో నమోదైన కొవిడ్ మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని, బాధితుల కుటుంబాలన్నింటికీ రూ.4 లక్షల పరిహారం అందివ్వాలని డిమాండ్ చేయడమే "#SpeakUpforCovidNyay" ప్రచారం లక్ష్యం."
-కాంగ్రెస్
congress on corona death ex gratia: కరోనా బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ ఆరోపించింది.
"కొవిడ్ మరణాల సంఖ్యను వక్రీకరించడం ద్వారా.. మహమ్మారి నిర్వహణలో తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయత్నించింది. మరణాల డేటా తన వద్ద లేదని చెబుతోంది. కానీ దేశం మొత్తం ఆ సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక నిధుల కొరత అసలే లేదు. కానీ.. కొవిడ్ బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోవడమే అసలు సమస్య."
-పవన్ ఖేరా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
corona death ex gratia amount in india: 'మహమ్మారి మరణాలకు న్యాయమైన మొత్తం అందివ్వకుండా.. స్వల్ప సహాయం(రూ.50,000) మాత్రం చేసేందుకు ప్రయత్నిస్తోంది' అని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తింది.
#SpeakUpForCovidNyayలో భాగంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆన్‌లైన్ ప్రచారానికి మద్దతుగా వీడియోలు పోస్ట్ చేస్తూ.. రూ.4 లక్షల పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ పేర్కొంది.
ఇవీ చదవండి: