ETV Bharat / bharat

27న రైతుల 'భారత్‌ బంద్‌'- కాంగ్రెస్​ మద్దతు

సెప్టెంబరు27న 'భారత్‌ బంద్‌'(Bharat bandh) పాటించాలని రైతులు ఇచ్చిన పిలుపునకు మద్దతిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పేర్కొన్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ.. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌(farmers agitation bandh) పిలుపునకు ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

farmers Bharat bandh
రైతుల భారత్‌ బంద్‌
author img

By

Published : Sep 26, 2021, 6:59 AM IST

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు గత ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్న రైతులు.. సెప్టెంబరు27న 'భారత్‌ బంద్‌'(Bharat bandh) పాటించాలని ఇచ్చిన పిలుపునకు మద్దతిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మాట్లాడుతూ.. రైతు సంఘాలు నిర్వహించే శాంతియుత బంద్‌కు(farmers agitation bandh) కాంగ్రెస్‌ కార్యకర్తలు అండగా నిలుస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చల ప్రక్రియ పునఃప్రారంభించి, మద్దతుధరను చట్టబద్ధం చేస్తూ కొత్త సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని తాము కోరుతున్నట్లు తెలిపారు.

2012-13 నాటి రైతుల ఆదాయ పరిస్థితులను 2018-19తో పోల్చితే 48 నుంచి 38 శాతానికి తగ్గాయన్నారు. ఇదే కాలవ్యవధిలో రైతుల సగటు రుణభారం రూ.47 వేల నుంచి రూ.74 వేలకు పెరిగినట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వ సర్వే ప్రకారమే.. రైతుల రోజువారీ ఆదాయం రూ.27 మాత్రమే ఉన్నట్లు గౌరవ్‌ వల్లభ్‌ తెలిపారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పంటల మద్దతుధరను చట్టబద్ధం చేయాలని లిఖితపూర్వకంగా కోరిన నరేంద్ర మోదీ.. ఇపుడు తన నిర్ణయాన్ని తానే ఆమోదించకపోవడం విడ్డూరమన్నారు. గతేడేళ్లలో వ్యవసాయరంగ పరిస్థితులు దారుణంగా దిగజారినందునే కాంగ్రెస్‌ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారత్​ బంద్​కు ఆప్​ మద్దతు

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ నేత రాఘవ్‌ చడ్డా శనివారం తెలిపారు.

కమల ఏమన్నారో మోదీకి అర్థమైందా: రాహుల్‌

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ చెప్పింది ప్రధాని మోదీకి అర్థమైందా? అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ(modi us visit).. శుక్రవారం కమలాహారిస్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "మనం మన దేశాలతో పాటు ప్రపంచంలోని ప్రజాస్వామ్య విలువలను, సంస్థ లను కాపాడుకోవాలి. ఇందుకోసం తొలుత దేశంలోని ప్రజాస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలి" అని అన్నారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ "ఇది ఆయనకు అర్థమైందా?" అంటూ ఇన్‌స్టాగ్రామ్​లో పోస్టు చేశారు.

ఇదీ చూడండి: పొంచి ఉన్న 'గులాబ్' ముప్పు- ఐఎండీ ఆరెంజ్ అలర్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.