ETV Bharat / bharat

జనవరి 1వరకు బాణసంచా పేల్చడం బంద్​! - దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ

ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న దిల్లీలో.. రానున్న పండుగ వేడుకల్లో ప్రజలు బాణసంచా కాలిస్తే మరింత కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాణసంచా పేల్చడం సహా అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(Delhi Pollution Control Committee) తెలిపింది.

firecrackers
బాణాసంచా
author img

By

Published : Sep 29, 2021, 5:09 AM IST

ప్రజల ఆరోగ్య క్షేమమే లక్ష్యంగా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ)(Delhi Pollution Control Committee) కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 వరకు బాణసంచా పేల్చడం సహా అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. అనేక మంది నిపుణులు.. మరో దశ కొవిడ్​ ఉద్ధృతి వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీపీసీసీ(Delhi Pollution Control Committee) చెప్పింది.

"బాణసంచా కాల్చుతూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తే.. భౌతికదూరం నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. దాంతో పాటు తీవ్ర వాయుకాలుష్యం కూడా ఏర్పడుతుంది. కరోనా సంక్షోభ సమయంలో బాణసంచా కాలిస్తే శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. అది ప్రజల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దేశ రాజధాని ప్రాంతంలో 2022 జనవరి 1వరకు అన్నిరకాల టపాసులు కాల్చడం, సహా అమ్మకాలపై పూర్తి నిషేధం కొనసాగుతుంది."

-దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ

జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో ఈ తాజా సూచనలు అమలయ్యేలా చూడాలని డీపీసీసీ(Delhi Pollution Control Committee) తెలిపింది. ఇందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలపై తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది.

అంతకుముందు.. బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ సెప్టెంబర్​ 15న తెలిపారు. 'ప్రజల ప్రాణాలు కాపాడటమే అత్యవసరం' అని పేర్కొన్నారు.

మరోవైపు.. కొద్దిరోజుల క్రితం నేషనల్​ క్యాపిటల్​ రీజియన్(ఎన్​సీఆర్​) పరిధిలోని రాష్ట్రాలు తమ ప్రజా రవాణా వాహనాలను సీఎన్​జీ వాహనాలుగా మార్చుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. విద్యుత్​ వాహనాలను ప్రోత్సహించే దిశగా కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పింది.

ఇదీ చూడండి: క్షీణిస్తున్న నీటిలభ్యత- ప్రమాదకర పరిస్థితుల్లో గంగ, యమున

ఇదీ చూడండి: కుంగుతున్న భారతీయుల ఆయుర్దాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.