లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్ సోదరుడు, ఎంపీ ప్రిన్స్ రాజ్ పాసవాన్‌పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ మేరకు మంగళవారం దిల్లీలోని కన్నోట్ ప్లేస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి ప్రిన్స్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
ప్రిన్స్ రాజ్ ఓ మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చిరాగ్ పాసవాన్ ఆరోపించిన కొన్ని గంటలకే మహిళ ఫిర్యాదు చేయడం గమనార్హం.
మహిళ ఫిర్యాదుపై పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై త్వరలో ప్రిన్స్ రాజ్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, ఆరోపణలు ఎంపీ స్థాయి వ్యక్తిపై వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : Chirag Paswan: ఎల్జేపీపై పట్టుకు నేతల ఎత్తులు