ETV Bharat / bharat

రూ.2కే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్​ - Courses In Patna For Just 2 Rupees

Compititive Coaching for Rs.2: బిహార్​లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ కోచింగ్ ఇన్​స్టిట్యూట్​. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రూ.2కే రివిజన్ తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Coaching Institute in Patna offers BPSC classes in rupees 2
రూ.2కే పోటీ పరీక్షలకు కోచింగ్​
author img

By

Published : Apr 8, 2022, 8:29 PM IST

Compititive Coaching for Rs.2: బిహార్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్​ ఇచ్చింది పట్నాలోని ఓ కోచింగ్ సంస్థ. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రూ.2కే రివిజన్ తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మే 8న బీపీఎస్​సీ ప్రీలిమినరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆఫీసర్స్ అకాడమీ కోచింగ్ ఇన్​స్టిట్యూట్ డైరెక్టర్ సౌరభ్ శర్మ​ రూ.2కే తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు.

ఆసక్తి గల అభ్యర్థులు ప్లే స్టోర్ నుంచి ఇన్​స్టిట్యూట్​ యాప్ డౌన్​లోడ్ చేసుకుని లేదా వెబ్​సైట్​లో పేరు నమోదు చేసుకుని ఆన్​లైన్​లో తరగతులు వినవచ్చు. ఇప్పటివరకు 4,000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇదికాకుండా 'వైభవ్ 30' పేరుతో ఓ కోర్సును ప్రారంభించనున్నట్లు సౌరభ్ శర్మ తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన మెరిట్ విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విద్యార్థులు ఇన్​స్టిట్యూట్ నిర్దేశించిన ఓ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 18+ వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్​- ఆదివారం నుంచే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.