ETV Bharat / bharat

'లఖింపుర్​ ఘటన' థీమ్​తో నవరాత్రి ఉత్సవాలు.. - నవరాత్రి బంగాల్​

బంగాల్​ డమ్​డమ్​ ప్రాంతంలో ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కమ్యూనిటీ క్లబ్​లో.. ఈ ఏడాది రైతుల ఉద్యమాన్ని థీమ్​గా ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న రైతుల ఉద్యమానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. వారికి మద్దతుగా నినాదాలు రాసిపెట్టారు. లఖింపుర్​ హింసాత్మక ఘటనను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే.. ఇది రాజకీయం కాదని, మానవత్వ కోణంలో చూడాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

dum dum park
దమ్​ దమ్​
author img

By

Published : Oct 8, 2021, 8:18 PM IST

Updated : Oct 8, 2021, 9:42 PM IST

'లఖింపుర్​ ఘటన' థీమ్​తో నవరాత్రి ఉత్సవాలు..

నవరాత్రి వేడుకలంటే ముందుగా గుర్తొచ్చేది బంగాల్​ రాష్ట్రం. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ఇందుకోసం మండపాలను అద్భుతంగా తీర్చిదిద్దుతుంటారు. వేడుకలకు డమ్​డమ్​ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడి కమ్యూనిటీ క్లబ్​లో ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో డమ్​డమ్​ పార్కులోని కమ్యూనిటీ క్లబ్​లో రైతుల ఉద్యమాన్ని థీమ్​గా ఏర్పాటు చేశారు. 'మా ధాన్యాన్ని వదులుకోము.. మా ఆత్మ గౌరవాన్ని విడిచిపెట్టము,' అన్న నినాదంతో కమ్యూనిటీ క్లబ్​ను తీర్చిదిద్దారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ హింసాత్మక ఘటన అంశం కూడా థీమ్​లో దర్శనమిచ్చింది.

Community Puja in Kolkata s northern outskirts depicts Lakhimpur tragedy
డమ్​ డమ్​లో థీమ్​ ఇలా

అనిర్బాన్​ అనే కళాకారుడి ఐడియాతో ఈ థీమ్​ పుట్టుకొచ్చింది. డమ్​డమ్​ భారత్​ చక్ర నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో వినూత్న థీమ్​లతో గత కొంతకాలంగా కమ్యూనిటీ క్లబ్​ అందరినీ అకట్టుకుంటోంది.

రైతులకు మద్దతుగా!

ఈ క్రమంలోనే ఈ ఏడాది రైతుల ఆందోళనలపై థీమ్​ను ఏర్పాటు చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా నిరసనలు జరుగుతున్నాయి. లఖింపుర్​ హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గత ఆదివారం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అన్నదాతల మీదకు ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చెలరేగిన ఘర్షణలో మరో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతులపైకి దూసుకెళ్లిన కారులో.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

పూజా మండపాల వద్ద

అయితే తాము ఏర్పాటు చేసిన థీమ్​కు.. రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవని నిర్వాహకులు స్పష్టం చేశారు.

"ఏ ఏడాది ఎంచుకున్న థీమ్​కు రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం మానవత్వం కోణంలోనే దీనిని ఏర్పాటు చేశాము."

-- నిర్వాహకులు.

రైతుల కష్టాలకు చిహ్నంగా.. పగిలిన వారి కాలి పాదాలను ప్రతిబింబించే విధంగా ప్రతిమను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లను కూడా పెట్టారు. అన్నదాతలకు మద్దతుగా పూజా మండపాల్లోని గోడలపై నినాదాలు రాశారు.

పూజా మండపం

రైతులకు మద్దతుగా థీమ్​

ఇవీ చూడండి:-

Last Updated : Oct 8, 2021, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.