ETV Bharat / bharat

Communal Harmony In Cuttack : తనఖాలో అమ్మవారి నగలు.. విడిపించిన ముస్లిం.. వెల్లివిరిసిన మత సామరస్యం - odisha latest news

Communal Harmony In Cuttack : తనఖా పెట్టిన అమ్మవారి ఆభరణాలను విడిపించాడు ఓ ముస్లిం వ్యక్తి. రూ. 48,000 సొంత నగదును చెల్లించి ఆభరణాలను తీసుకువచ్చాడు. మత సామరస్యం వెల్లివిరిసే ఈ ఘటన ఒడిశాలోని కటక్​లో జరిగింది.

Communal Harmony In Cuttack
Communal Harmony In Cuttack
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 11:02 AM IST

Updated : Oct 18, 2023, 11:47 AM IST

Communal Harmony In Cuttack : ఒడిశాలోని కటక్​లో మత సామరస్యం వెల్లివిరిసింది. తనఖా పెట్టిన అమ్మవారి ఆభరణాలను విడిపించాడు ఓ ముస్లిం వ్యక్తి. రూ. 48,000 సొంత నగదును చెల్లించి ఆభరణాలను తీసుకువచ్చాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదీ జరిగింది
కటక్​లోని సతాతా ప్రాంతంలో శారదీయ దుర్గా పూజకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, ఇంతకుముందు అమ్మవారి పూజ మండప అభివృద్ధి పనులు చేసిన సభ్యుడికి నగదు చెల్లించలేదు కమిటీ. దీంతో అతడు అమ్మవారి నగలు తీసుకుని.. తనఖా పెట్టుకున్నాడు. తన నగదు చెల్లిస్తే.. ఆభరణాలను తిరిగి ఇస్తానని కమిటీకి స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే అమ్మవారి ఆభరణాలు లేకుండా పూజలు ఎలా చేయాలన్న సందిగ్ధంలో పడింది ఆలయ కమిటీ. ఈ సమస్యను విన్న స్థానిక ముస్లిం నేత షేక్​ లియాకత్​ ఉద్దీన్ అహ్మద్​ ముందుకు వచ్చారు. నిర్మాణదారుడికి ఇవ్వాల్సిన రూ. 48 వేలు చెల్లించి ఆభరణాలను విడిపించాడు. సమస్య పరిష్కారం కావడం వల్ల దుర్గాదేవి పూజకు సిద్ధం చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.

Communal Harmony In Cuttack
నగలను విడిపించిన ముస్లిం వ్యక్తి అహ్మద్​

"ఆలయ మాజీ కమిటీ సభ్యుడు.. పూజ మండపం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం అతడు రూ. 48వేల వరకు సొంతంగా వెచ్చించాడు. అయితే, దీనికి సంబంధించిన నగదును తిరిగి అతడికి చెల్లించకపోవడం.. ఆభరణాలు తనఖా పెట్టుకున్నాడు. కమిటీ సభ్యులు.. నన్ను సంప్రదించగా ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అతడికి రావాల్సిన మొత్తాన్ని చెల్లించి నగలను విడిపించాను. మేము 14 తరాలుగా ఇక్కడే నివసిస్తున్నాము. ఇక్కడ తామంతా సోదరుల్లా కలిసి మెలిసి జీవిస్తాం."

--షేక్​ లియాకత్​ ఉద్దీన్ అహ్మద్, నగలు విడిపించిన వ్యక్తి

హిందూ ఆలయం కోసం ముస్లిం భూదానం
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఓ ముస్లిం వ్యక్తి.. హిందూ దేవాలయం కోసం రూ.కోటి విలువ చేసే భూమిని ఉచితంగా అందించాడు. మతమేదైనా.. అందరూ సమానమేనని చాటి చెప్పాడు. హోసకోట్​ తహసీల్​ కదుగోడిలోని బెలాతుర్​ కాలనీకి చెందిన హెచ్​ఎమ్​జీ బాషా.. తన 1633.63 చదరపు అడుగుల భూమిని వీరాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్​కు ఉచితంగా అందించారు. ఈ ఆలయం.. బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఉంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Muslim Build Temple : అమ్మవారి గుడి నిర్మించిన దివ్యాంగ ముస్లిం.. రోజూ ప్రత్యేక పూజలు

Communal Harmony In Karnataka : గుడిలో ముస్లిం ఫ్రెండ్​కు తులాభారం.. తిరుపతిలో మొక్కు తీర్చుకున్న హిందూ స్నేహితుడు

Last Updated : Oct 18, 2023, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.