ETV Bharat / bharat

'పింఛనర్ల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం' - ఎన్​పీఎస్

పింఛనర్ల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడేలా పింఛను పథకాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపింది. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఎన్​పీఎస్​ కమిటీ సూచనలకు తగ్గట్లుగా పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.

NPS subscribers
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
author img

By

Published : Jan 6, 2021, 6:12 AM IST

'జాతీయ పింఛను పథకం' (ఎన్​పీఎస్​) వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడేలా పథకాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపింది.

'పాత పింఛను పథకం జాతీయోద్యమం'(ఎన్​ఎంఓపీఎస్​) దిల్లీ విభాగం అధ్యక్షుడు మన్జీత్​సింగ్​ పటేల్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెట్టుకున్న ఓ దరఖాస్తు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దరఖాస్తులో పలు అంశాలను లేవనెత్తారు. పింఛనర్ల సంక్షేమం పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకే ప్రభుత్వం జాతీయ పింఛను విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రత్వశాఖ తరఫున వెలువడిన ప్రకటనలో స్పష్టం చేశారు. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఎన్​పీఎస్​ కమిటీ సూచనలకు తగ్గట్లుగా పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.

పథకంలో ప్రభుత్వం వాటాను పది నుంచి14 శాతానికి పెంచటం, వినియోగదారులకు పింఛను నిధుల పెట్టుబడులకు స్వేచ్ఛ కల్పించటం వంటి ప్రతిపాదనలు ఇందులో భాగమేనని ప్రకటనలో పేర్కొన్నారు. 13 లక్షల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు సభ్యులుగా ఉన్న ఎన్​ఎంఓపీఎస్​.. జాతీయ పింఛను పథకాన్ని పాత పథకంలా ప్రయోజనకారిగా తీర్చిదిద్దాలని కోరుతోంది.

ఇదీ చూడండి: యువకుడిని చంపిన యువతిని కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.