Cocaine capsules in Stomach: మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న విదేశీ మహిళను దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వచ్ఛమైన కొకైన్‌ను క్యాప్సూళ్లలో నింపి.. పొట్టలో దాచుకొని స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు మొత్తం 51 క్యాప్సూళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికాలోని మాళవి దేశానికి చెందిన ఆ మహిళ... ఇథియోపియా మీదుగా దిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రీన్ ఛానెల్‌ను దాటే క్రమంలో ఆమె పట్టుబడిందని చెప్పారు.
అనంతరం, మహిళను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు ప్రయత్నించి కడుపులో నుంచి క్యాప్సుళ్లన్నింటినీ బయటకు తీశారు. ఈ క్యాప్సుళ్లలోని కొకైన్ విలువ రూ.9.11 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మే 27న మహిళ దిల్లీకి వచ్చిందని అదనపు కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. 'చెకింగ్‌లో ఆమె ఏదో తీసుకెళ్తున్నట్లు తేలింది. బ్యాగులను తనిఖీ చేశాం. ఎలాంటి మత్తు పదార్థాలు బయటపడలేదు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని పరీక్షించగా.. కడుపులో ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత మహిళను కస్టడీలోకి తీసుకొని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించాం. ఆమె పొట్టలో నుంచి 607 గ్రాముల స్వచ్ఛమైన కొకైన్‌ను బయటకు తీశాం' అని వివరించారు.
ఇదీ చదవండి: