ETV Bharat / bharat

650కి పైగా రైళ్లను రద్దు చేసిన కేంద్రం.. అదే కారణం

coal shortage: బొగ్గు సంక్షోభం కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లోన్ని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల కరెంట్ కోతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు 42 ప్రయాణికుల రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

d
d
author img

By

Published : Apr 30, 2022, 5:01 AM IST

coal shortage: దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికీ తీవ్రతరమవుతోంది. పలు రాష్ట్రాల్లోన్ని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తోంది.

బొగ్గు రవాణాను పెంచేందుకు నేడు 42 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు. మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. రైళ్ల రద్దు తాత్కాలికమేనని, బొగ్గు సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే బొగ్గు కొరత కారణంగా డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో అనేక చోట్ల కరెంట్ కోతలు వేధిస్తున్నాయి. దేశీయ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు 17శాతం బొగ్గు నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.

పవర్‌ ప్లాంట్ల వద్ద కనీసం 21 రోజులకు బొగ్గు నిల్వలు ఉండాలని, అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఒక రోజుకు మించి సరిపడా నిల్వలు లేవని దిల్లీ విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దిల్లీలో ఆసుపత్రులు, మెట్రోలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించారు. వీలైనంత త్వరగా బొగ్గు సరఫరాను పెంచాలని కోరారు. దిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గి కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి బొగ్గు సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: 90 కిలోల హెరాయిన్​ పట్టివేత​​​.. విలువ రూ.450 కోట్లకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.