ETV Bharat / bharat

కేరళ కళాశాలలో అధునాతన థియేటర్

author img

By

Published : Feb 28, 2021, 10:32 AM IST

అత్యాధునిక సాంకేతిక సహకారంతో కేరళలోని ఓ కళాశాలలో విద్యాబోధన జరగనుంది. బోధనతో పాటు ఫిల్మ్​ ఫెస్టివల్స్​ కూడా జరిగేలా నవీన థియేటర్​ను ఏర్పాటు చేశారు.

CMS College, Kottayam all set to open the first multiplex theatre on campus
కేరళ కళాశాలలో అధునాతన థియేటర్

కేరళలోని కొట్టాయంలో ఉన్న సీఎంఎస్​ కళాశాలలో ఓ అధునాతన థియేటర్​ను ఏర్పాటు చేశారు. పాత ఆడిటోరియాన్ని ఆధునీకరించి రూ.30 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. విద్యా ప్రమాణాలను పెంచి, ఉన్నత స్థాయిలో బోధించేందుకు దీనిని రూపొందించారు.

సీఎంఎస్ కళాశాలలోని థియేటర్

ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 86 ప్రత్యేక కుర్చీలు, అత్యాధునిక శబ్ద, దృశ్య వ్యవస్థలను ఈ థియేటర్లో అమర్చారు. కళాశాలలోని పాత భవనంలోనే దీనిని ఏర్పాటు చేయడం ద్వారా దాని పాశ్చాత్య నిర్మాణ సౌందర్యాన్ని యధాతథంగా కొనసాగించారు.

ఈ థియేటర్లో ఫిల్మ్​ ఫెస్టివల్​లు కూడా జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ వర్గీస్ జోషువా తెలిపారు. అందులో బోధన ద్వారా విద్యార్థులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. సీఎంఎస్​ కళాశాలపై ఓ డాక్యుమెంటరీతో వచ్చేవారం ఈ థియేటర్​ను ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి: అక్కడ కల్తీ చేస్తే జీవితఖైదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.