ETV Bharat / bharat

సీఎం యోగికి గుడి.. రోజుకు రెండుసార్లు పూజలు, ప్రసాదం

Yogi Adityanath Temple : ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై అభిమానాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఏకంగా ఆయన విగ్రహంతో గుడికట్టి.. రోజూ ప్రత్యేక పూజలు చేస్తున్నాడు.

Yogi Adityanath Temple
Yogi Adityanath Temple
author img

By

Published : Sep 19, 2022, 5:54 PM IST

సీఎం యోగికి గుడి.. రోజుకు రెండుసార్లు పూజలు, ప్రసాదం

Yogi Adityanath Temple : నిలువెత్తు విగ్రహం.. కాషాయ దుస్తులతో అలంకరణ.. చేతిలో బాణం.. తల చుట్టూ కాంతి వలయం.. రోజుకు రెండు సార్లు పూజలు, ప్రసాదాలు.. సాధారణంగా ఏ దేవుడి గుడిలోనైనా కనిపించే దృశ్యాలే ఇవి. కానీ.. ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్య జిల్లా భరత్​కుండ్​లోని ఆలయం మాత్రం ప్రత్యేకం. ఈ గుడిలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రతిమనే దేవుడి రూపంలో ప్రతిష్టించి, నిత్య పూజలు చేయడం విశేషం.

అయోధ్యలోని రామ జన్మభూమికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది భరత్​కుండ్. వనవాసానికి వెళ్లే ముందు.. రాముడికి ఇక్కడే భరతుడు వీడ్కోలు పలికాడని చెబుతుంటారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తికి యోగి ఆదిత్యనాథ్​ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన కోసం ఫైజాబాద్-ప్రయాగ్​రాజ్​ హైవే పక్కన గుడి కట్టేశాడు.

"రాముడి కోసం గుడి కడుతున్న యోగి కోసం మేము ఆలయం నిర్మించాం. ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారా దేవుడి స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనకు గుడి కట్టాలన్న ఆలోచన వచ్చింది." అని చెప్పాడు ప్రభాకర్ మౌర్య. శ్రీరాముడికి చేసినట్టే.. రోజుకు రెండుసార్లు ఆదిత్యనాథ్​ విగ్రహం ముందు కీర్తనలు పాడుతున్నాడు ప్రభాకర్. పూజల తర్వాత 'భక్తులకు' ప్రసాదం పంచి పెడుతున్నాడు.

తనకు ఉద్యోగం, భూమి లేదని చెప్పాడు ప్రభాకర్. కానీ.. నెలకు రూ.లక్ష ఆదాయం వస్తుందంట. భజన్లు, భక్తి గీతాలు పాడి యూట్యూబ్​లో పోస్ట్ చేయడం ద్వారా ఈ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు ప్రభాకర్. ఆ సొమ్ముతోనే యోగి కోసం గుడి కట్టానని వివరించాడు.

ఇవీ చదవండి: కర్ణాటక టు యూపీ.. రోడ్డుమార్గంలోనే రోగి షిఫ్ట్.. 2,700 కి.మీ నాన్​స్టాప్​గా..

కస్టమర్స్​లా ఎంట్రీ.. క్షణాల్లో బంగారం మాయం.. అక్కాతమ్ముళ్ల బిగ్​ స్కామ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.