ETV Bharat / bharat

ఘనంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, ప్రకాశ్ అంబేడ్కర్ - సీఎం కేసీఆర్ తాజా వార్తలు

Cm Kcr Unveiling 125 Feets Ambedkar Statue : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహాన్ని... ముఖ్యమంత్రి కేసీఆర్, బాబాసాహెబ్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్‌ జీవిత విశేషాల ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించారు.

Cm Kcr
Cm Kcr
author img

By

Published : Apr 14, 2023, 4:19 PM IST

Updated : Apr 14, 2023, 9:07 PM IST

ఘనంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌, ప్రకాశ్ అంబేడ్కర్

Cm Kcr Unveiling 125 Feets Ambedkar Statue : సామాజిక సమతాస్పూర్తి, విశ్వమానవ హక్కుల దిక్సూచి భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్ భారీ విగ్రహావిష్కరణను అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ 125 అడుగుల ఎత్తున స్మారకం ఆవిష్కరణ కనులపండువగా సాగింది. మంత్రులు, ఎంపీలు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం : తొలుత శిలాఫలకం ఆవిష్కరించి... ఆ తర్వాత ఆడిటోరియం ప్రధానభవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. లిఫ్టు ద్వారా మహానీయుడి విగ్రహం పాదాల వద్దకు చేరుకొని అక్కడ బౌద్ధగురువుల పూజలు, ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమున్నతంగా పండగ వాతావరణంలో విగ్రహావిష్కరణ చేశారు. ఈ సమయంలో హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు. పార్లమెంట్‌ ఆకారంలోని... 50 అడుగుల పీఠంపై విగ్రహాన్ని ఏర్పాటు చేయగా... పీఠం లోపల అంబేడ్కర్‌ జీవిత ఘట్టాలకు చెందిన ఛాయా చిత్రాలతో ప్రత్యేక ఫొటోఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం, ప్రకాశ్‌ అంబేడ్కర్‌ : పార్లమెంట్‌ ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఏర్పాటుచేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణకు అశేషంగా జనవాహిని తరలివచ్చారు. పీఠం లోపల అంబేడ్కర్‌ జీవిత ఘట్టాలకు చెందిన ఛాయాచిత్రాలతో ప్రత్యేక ఫొటోఎగ్జిబిషన్‌ను సీఎం, ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఆసక్తిగా తిలకించారు. ఆడియో, విజువల్‌ ఏర్పాట్లు, అంతర్గత ఇంటీరియర్‌ డిజైన్లను చూసి అబ్బురపడ్డారు. జిల్లాల నుంచి తరలివచ్చిన 50 వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా 750 బస్సులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున జనసమీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదికపై నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రసంగించనున్నారు.

కేసీఆర్‌తో కలిసి భోజనం చేసిన ప్రకాశ్‌ అంబేడ్కర్‌ : భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ముందు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అధికారిక నివాసానికి వచ్చిన విశిష్ఠ అతిథిని కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్‌ అంబేడ్కర్‌ భోజనం చేశారు. అనంతరం ఈ మధ్యాహ్నం.. 3 గంటల తర్వాత ప్రగతిభవన్‌ నుంచి ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి కేసీఆర్‌... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్‌ స్మారకానికి చేరుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 14, 2023, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.