ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు(Rains in uttarakhand) బీభత్సం సృష్టిస్తున్నాయి. పిథోర్‌గఢ్ జిల్లా ధార్చులా తాలుకాలోని జుమ్మా గ్రామంలో ఆదివారం రాత్రి కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. ఏడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ చౌహాన్ సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలను నిర్విరామంగా చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సామగ్రిని ఆ ప్రాంతానికి పంపించారు. ఎస్పీతో కలిసి ఘటనాస్థలికి వెళ్లి స్వయంగా పరిశీలించారు.



జుమ్మా గ్రామంలో రాకపోకలు స్తంభించగా.. సహాయక చర్యల కోసం ఓ హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా ఆశిష్ చౌహాన్ తెలిపారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పింపించినట్లు పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి ఫోన్..
మరోవైపు.. పిథోర్‌గడ్ కలెక్టర్‌తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగించాలని తెలిపారు. గాయపడ్డవారికి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: ఫ్రెండ్‌ను నమ్మి వెళ్లడమే ఆ బాలిక తప్పు.. ఏడుగురు కలిసి...