ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు సంభవించి.. మాల్దేవతా రహదారి ధ్వంసమైంది. రోడ్డు మొత్తం రాళ్లు రప్పలతో నిండిపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లుల్లోకి వరద నీరు ప్రవేశించింది.
భారీ వర్షాలు వల్ల ఆ ప్రాంతంలోని రహదారులను మూసివేశారు. దీంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్నరాష్ట్ర కేబినెట్ మంత్రి గణేశ్ జోషి.. పరిస్థితిని పరిశీలించారు. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడారు.
ఇదీ చూడండి: ఆ జూలో మరో రెండు సింహాలకు కరోనా