ETV Bharat / bharat

"జనగణమనలో 'సింధ్'​ను తొలగించండి.. పాక్​ను కీర్తిస్తూ పాడేదెలా?"

National Anthem in Madrasa: ఉత్తర్​ప్రదేశ్​లోని మదర్సాలలో జాతీయ గీతం పాడాలనే విధానంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జనగణమనలో సింధ్​ పదాన్ని తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు పలువురు మతపెద్దలు. పాకిస్థాన్​లోని ప్రాంతాన్ని కీర్తిస్తూ జాతీయగీతం ఆలపించలేమని అంటున్నారు.

remove sindh from national anthem
national anthem in madrasa
author img

By

Published : May 14, 2022, 10:15 PM IST

National Anthem in Madrasa: ఉత్తర్​ప్రదేశ్​లోని ఎయిడెడ్​, నాన్​ ఎయిడెడ్​ మదర్సాలలో తరగతులకు ముందు జాతీయ గీతం ఆలపించాలనే నిబంధనను ఇటీవలే విధించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ ఆదేశాలపై గాజీపుర్​లోని​ మతపెద్దల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహమ్మదాబాద్​కు చెందిన మౌలానా అన్వర్​ హుస్సేన్ సిద్ధిఖీ అనే వ్యక్తి.. ఈ ఉత్తర్వులను స్వీకరిస్తూనే సీఎంకు ఓ విన్నపం చేశారు.

"పాకిస్థాన్​కు భారత్​కు శత్రుదేశం. జాతీయ గీతంలో సింధ్​ అనే పదం ఉంటుంది. పాక్​తో మన సంబంధాలు చెడిపోయిన వేళ ఆ దేశంలోని సింధ్​ ప్రాంతానికి పొగుడుతూ జనగణమన పాడలేము" అని మౌల్వీ సిద్ధిఖీ అన్నారు. సింధ్​ పదాన్ని జాతీయగీతాన్ని తొలగించి, ఆ స్థానంలో వేరే పదాన్ని చేర్చాలని డిమాండ్​ చేశారు.

హిందూ-ముస్లిం, గుడి-మసీద్​ లాంటివాటిని మించి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని యోగిని అభ్యర్థించారు మౌల్వీ సిద్ధిఖీ. ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క చుక్క చమట చిందిస్తే.. రాష్ట్రం, దేశం కోసం ముస్లింలు ప్రాణం పెట్టేస్తారని అన్నారు. యోగి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు ముంతాజ్ అన్సారీ మదర్సా ఆచార్య ఇన్​స్ట్రక్షన్​ రాష్ట్ర అధ్యక్షుడు. మదర్సాలలో జాతీయ గీతం విధానాన్ని ఆహ్వానించిన ఆయన.. తన చివరి శ్వాస వరకు జనగణమన పాడతానని చెప్పారు. అది దేశ ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, దేశభక్తిని పెంపొందిస్తుందని అన్నారు.

ఇదీ చూడండి: యోగి 'మార్క్'​ పాలన.. వారంతా ఆస్తులు ప్రకటించాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.