దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా సుప్రీంకోర్టుకు ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈనెల 14న సెలవులు మొదలు కావాల్సి ఉండగా.. కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండడం కారణంగా తేదీని ముందుకు జరిపారు.
ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కరోనా బారినపడిన నేపథ్యంలో ఒక వారం ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కోరింది. ఫుల్ బెంచ్‌ను సమావేశపరిచి, ఈ అంశంపై జస్టిస్ రమణ చర్చించారు. వేసవి సెలవులను ముందుకు జరపాలన్న ప్రతిపాదనకు ధర్మాసనంలోని సభ్యులందరూ అంగీకరించగా.. సీజేఐ ఉత్తర్వులు వెలువరించారు.
జూన్ 27న సుప్రీంకోర్టు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇదీ చూడండి:'సుప్రీంకోర్టుకు ముందస్తుగా వేసవి సెలవులు ఇవ్వండి'