జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలో ఓ పౌరుడిపై కాల్పులకు(Militant Attack In Kashmir) తెగబడ్డారు. ఈ ఘటనలో పౌరుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో బొహ్రీ కదల్ ప్రాంతంలో మహమ్మద్ ఇబ్రహీంఖాన్‌పై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇబ్రహీం.. మహారాజ్ఘంజ్ ప్రాంతంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ దాడిని(Militant Attack In Kashmir) నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇబ్రహీం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఆదివారం రాత్రి సైతం.. ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. బాటమలూ ప్రాంతంలో ఓ కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు ఉగ్రవాదులు.
ఇదీ చూడండి: 'దేశంలోనే అత్యుత్తమ యాత్రాస్థలంగా పండర్‌పుర్!'