ETV Bharat / bharat

రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్

author img

By

Published : Jul 19, 2021, 6:02 PM IST

కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి హిందూ ఆలయాన్ని నిర్మించి ఆదర్శంగా నిలుస్తున్నారు. రూ.2 కోట్లతో ఈ ఆలయాన్ని కట్టించారు. తన తల్లిదండ్రుల స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గాబ్రియెల్​ వెల్లడించారు.

christian built temple in karnataka
హిందూ ఆలయాన్ని నిర్మించిన క్రిస్టియన్
రూ.2 కోట్లతో హిందూ ఆలయాన్ని నిర్మించిన క్రిస్టియన్

కర్ణాటకకు చెందిన ఓ 77 ఏళ్లు వ్యాపారి మత సామరస్యాన్ని చాటుకున్నారు. క్రైస్తవుడైన గాబ్రియెల్ నజరెత్ ఉడుపి జిల్లా శిర్వాలోని​ తన ఇంటి సమీపంలో సొంత ఖర్చుతో సిద్ధి వినాయక ఆలయాన్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ. 2 కోట్లు ఖర్చు అయ్యాయి. తన తల్లిదండ్రులు ఫాబియన్​ సెబాస్టియన్ నజరెత్​, సబీనా నజరెత్​ స్మారకంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గాబ్రియెల్​ వెల్లడించారు.

ముంబయిలో సుమారు 55 ఏళ్లు నివసించిన గాబ్రియెల్​.. స్థానికంగా ఉన్న సిద్ధివినాయక స్వామి ఆలయాన్ని తరచూ సందర్శించేవారు. సిద్ధివినాయక స్వామి వల్లనే తన జీవితం​లో ఎన్నో విజయాలు సాధించగలిగానని చెప్పుకొచ్చారు. తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా హిందూ మతం అంటే తనకు ఎంతో గౌరవమన్నారు.

దశాబ్దం క్రితం ముంబయిను విడిచి తన స్వగ్రామంలో స్థిరపడ్డ గాబ్రియల్​.. అక్కడ ఓ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల ఇంటి సమీపాన 20 సెంట్ల విస్తీర్ణంలో గుడి కట్టించారు.

ఇదీ చదవండి : ఈ పెన్​ చాలా కాస్​ట్లీ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.