China's military hardware export to Pak: పాకిస్థాన్‌కు ఓడలు, జలాంతర్గాములు వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను చైనా ఎగుమతి చేస్తోందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అన్నారు. ఇది భారత్‌లోని వివిధ ప్రాంతాల భద్రతను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వెలాను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నేవీ చీఫ్.. మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ నెల ఆరంభంలో పాకిస్థాన్‌కు అత్యంత అధునాతన యుద్ధనౌకను చైనా సరఫరా చేసినట్లు విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించి, నిర్మించిన ఈ యుద్ధనౌకను షాంఘైలో జరిగిన కమిషన్ వేడుకలో పాకిస్థాన్ నేవీకి చైనా అప్పగించింది. 054ఏ/పీ పీఎన్ రకానికి చెందిన దీనికి పీఎన్ఎస్ తుగ్రిల్ అని పేరు పెట్టారు. మొదట నుంచి కూడా చైనా, పాకిస్థాన్‌కు ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా ఉంటుంది. కీలకమైన సైనిక హార్డ్వేర్లు, ఇతర పరికరాలను అందిస్తోంది.
ఇదీ చూడండి: చైనాకు ఝలక్.. ఆ ఎన్నికల్లో భారత్‌కు జైకొట్టిన ప్రపంచ దేశాలు