ETV Bharat / bharat

డోక్లాం తర్వాతి నుంచే చైనా కుట్రలు! - వాస్తవాధీన రేఖ వెంబడి 20 చైనా సైనిక శిబిరాలు

డోక్లాం ప్రతిష్టంభన తర్వాతి నుంచే వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక శిబిరాలను నెలకొల్పడం చైనా ప్రారంభించిందని అధికారులు తెలిపారు. సరిహద్దులో 20 క్యాంపులను గుర్తించినట్లు చెప్పారు. లద్దాఖ్​ నుంచి అరుణాచల్​ ప్రదేశ్ వరకు ఇవి ఉన్నట్లు స్పష్టం చేశారు.

Post-Doklam, China developing military camps in depth areas along LAC
డోక్లాం తర్వాతి నుంచే చైనా కుట్రలు!
author img

By

Published : Dec 8, 2020, 5:57 PM IST

భారత్​తో సరిహద్దు ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ముందునుంచే చైనా సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. డోక్లాం ఘటన తర్వాత సరిహద్దులో అనేక సైనిక క్యాంపులను నెలకొల్పింది. లద్దాఖ్ నుంచి అరుణాచల్​ప్రదేశ్ వరకు వీటిని ఏర్పాటు చేసింది.

"వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని లోతైన ప్రాంతాల్లో చైనా సైనిక స్థావరాలను అభివృద్ధి చేస్తోంది. దాదాపు 20 క్యాంపులను గుర్తించాం. సాధారణ పౌరులు ఉన్న ప్రాంతాల్లో సైతం కొన్ని క్యాంపులు ఉన్నాయి."

-ప్రభుత్వ వర్గాలు

వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ మెరుగుపర్చేందుకు చైనా సైన్యానికి ఈ క్యాంపులు ఉపయోగపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దులో తలెత్తే పరిణామాలకు వేగంగా ప్రతిస్పందించేందుకు పనికొస్తున్నట్లు పేర్కొన్నాయి.

2017లో రెండు నెలలకుపైగా భారత్, చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. భూటాన్​ సరిహద్దులో రహదారులు నిర్మించడాన్ని భారత్ వ్యతిరేకించింది. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచింది. భారత్​ ప్రవర్తించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.