ETV Bharat / bharat

ప్రభుత్వ వేడుకల్లో అపశ్రుతి.. 150మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్! - Children Sick In Bihar Diwas Program

Children Sick In Bihar Diwas Program: ఫుడ్​ పాయిజన్​తో 150 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. బిహార్​ దివస్​ వేడుకల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Children Sick in Bihar Diwas Program
Children Sick in Bihar Diwas Program
author img

By

Published : Mar 24, 2022, 4:07 PM IST

Children Sick in Bihar Diwas Program: పట్నాలో జరిగిన బిహార్​ దివస్​ వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం.. చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు ఫుడ్​ పాయిజనే కారణమని తెలుస్తోంది. 156 మందికిపైగా పట్నా మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలామంది కడుపునొప్పి, వాంతులతో బాధపడినట్లు పేర్కొన్నారు. వీరంతా బిహార్​ దివస్​ వేడుకల కోసం వివిధ జిల్లాల నుంచి పట్నా వచ్చారు.

Children Sick in Bihar Diwas Program
అస్వస్థతకు గురైన విద్యార్థులు
Children Sick in Bihar Diwas Program
చికిత్స తీసుకుంటున్న విద్యార్థులు

అందరికీ మంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు సివిల్​ సర్జన్​ డా. విభా సింగ్​. విద్యార్థులు తిన్న ఆహారంతోనే సమస్య తలెత్తిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ కోసం కలెక్టర్​ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. అసలు ఇంతమంది ఎలా అనారోగ్యం బారినపడ్డారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బిహార్​ దివస్​లో భాగంగా ప్రభుత్వం పట్నాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలు గురువారం ముగియనున్నాయి.

Children Sick in Bihar Diwas Program
ఫుడ్​ పాయిజన్​కు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు

ఇవీ చూడండి: భార్యలను మార్చుకున్న స్నేహితులు.. చివరకు దిమ్మతిరిగే షాక

బాలుడిపై దంపతుల క్రూరత్వం.. లైంగికంగా హింసించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.