ETV Bharat / bharat

అమానుషం: క్షుద్రపూజలకు చిన్నారి బలి - black magic in uttar pradesh

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ చిన్నారి క్షుద్రపూజలకు బలైంది. తొలుత కనిపించకుండా పోయిన బాలిక చివరకు విగతజీవిగా తల్లిదండ్రులకు దొరికింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Minor girl killed for black magic in Kanpur
క్షుద్రవిద్యలకు బలైన చిన్నారి
author img

By

Published : Nov 15, 2020, 4:05 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. క్షుద్రపూజలు ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలు తీశాయి. నిందితులు బాలికను ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. శరీరంలోని అవయవాలను తొలగించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇదీ జరిగింది...

బాలిక శనివారం కనిపించకుండా పోయింది. ఆమె కోసం గ్రామస్థులు ఎంతో సేపు వెతికినా.. ఫలితం దక్కలేదు. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన వారికి.. ఊరి చివర పొలాల్లో ఉండే కాళీమాత గుడి వద్ద చిన్నారి మృతదేహం కనిపించింది. ఆమె శరీరంలోని అవయవాలను తొలగించారని గ్రామస్థులు తెలిపారు. ఇలా కేవలం క్షుద్రపూజల్లోనే జరుగుతుందని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పంచనామా కోసం బాలిక మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా దోషులను శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.