Chikmagalur Elecric Shock Death : కర్ణాటక చిక్కమంగళూరులో జరిగిన గణేశ్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. బి. హోసల్లి గ్రామంలో వినాయకుడ్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు.. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని.. నిర్వాహకులు ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన మండపంలో పెట్టి పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్లారు. నిమజ్జనం అనంతరం ఆరుగురు గ్రామస్థులు ట్రాక్టర్ ట్రాలీపై కూర్చుని తిరుగుముఖం పట్టారు.
ఈ క్రమంలో విద్యుత్ తీగ ట్రాక్టర్‌పైన ఉన్న మండపానికి తగిలి అందులోని వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అందులోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజు(47), రచన(35), పార్వతిగా (26) గుర్తించారు. విద్యుత్ తీగలు మరీ కిందకు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని.. విద్యుత్‌శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి : ఆ సినిమా ఎఫెక్ట్.. తండ్రితో కలిసి బామ్మను చంపిన వ్యక్తి.. శరీరాన్ని 9 ముక్కలు చేసి..
టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను విరిచేసిన కోడలు.. మధ్యలో వచ్చిన భర్తను సైతం..