జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తఫా అధినేత హిదాయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్ము, అనంత్ నాగ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో భాగంగా జమ్ము పట్టణ శివార్లలోని కుంజ్వాణి బైపాస్ వద్ద ఈ ముష్కరుడిని పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు హిదాయతుల్లా నేతృత్వంలో లష్కరే ముస్తఫా అనుబంధ సంస్థగా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు నుంచి తుపాకీ, గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు సమయంలో సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి