ETV Bharat / bharat

'ముందే రద్దు చేసి ఉంటే ఆ 700 మంది రైతుల ప్రాణాలు దక్కేవి' - ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ టుడే

సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు అన్నదాతల అద్భుత పోరాటానికి ప్రతీకగా పేర్కొన్నారు.

cms reaction
వ్యవసాయ చట్టాలు
author img

By

Published : Nov 19, 2021, 1:24 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను రద్దు(farm laws latest news) చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై విపక్షాలు స్పందించాయి. 'ఇది అన్నదాతల పోరాట ఫలితం' అంటూ రైతులకు శుభాకాంక్షలు తెలిపాయి.

ఈ ప్రకటనను స్వాగతించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రైతుల విజయంగా దీనిని అభివర్ణించారు. గతంలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే తీర్మానం చేసిందని గుర్తుచేశారు. 'ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టాన్ని గౌరవించాలి' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

"రైతు వ్యతిరేక చట్టాల రద్దు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. చరిత్రను ఒకసారి గమనిస్తే.. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని తెలుస్తోంది. గాంధేయ మార్గంలో ఈ విజయం సాధించిన రైతులకు అభినందనలు."

---ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

'ప్రకాశ్‌ దివస్‌'(prakash diwas 2021) రోజున శుభవార్త విన్నామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal news) అన్నారు. వీటిని రద్దు ముందే చేసి ఉంటే 700మంది రైతుల ప్రాణాలు నిలిచేవని వ్యాఖ్యానించారు. ప్రాణాలను లెక్కచేయని అన్నదాతల పోరాటాలు తరతరాలు గుర్తుంటాయని పేర్కొన్నారు.

"మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు ఫలితం దక్కింది. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. దేశ రైతులకు సెల్యూట్‌."

---అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలను ఎన్నికల(up election 2022) నేపథ్యంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు(farm laws repeal) చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(ashok gehlot latest tweet) అభిప్రాయపడ్డారు.

"రైతుల శ్రమ ఫలించింది. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఎన్నికల్లో గెలిచేందుకే ప్రధాని, భాజపా ప్రయత్నిస్తున్నాయి. అయితే బంగాల్ ఎన్నికల్లాంటి షాక్ తగులుతుందని వారికి తెలియదు."

--అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం

వ్యవసాయ చట్టాలను రద్దు ప్రకటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(basavaraj bommai latest news) హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల పట్ల మోదీ ప్రభుత్వానకి ఉన్న బాధ్యతను(modi on farm laws) తెలుపుతోందన్నారు. దీనిపై అనవసర చర్చలను తావులేదని స్పష్టం చేశారు.

"ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు.. వ్యవసాయ చట్టాల రద్దుకు ఎలాంటి సంబంధం లేదు. నిరసనల మధ్య కూడా ఉప ఎన్నికల్లో విజయం సాధించాం."

--బసవరాజ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

దేశ, రైతు ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం స్వాగతించదగినదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(odisha cm twitter) పేర్కొన్నారు. బీజేడీ(naveen patnaik party) మొదటినుంచి రైతులకు అండగా నిలుస్తోందన్నారు.

"రైతులారా మీ సాగుభూమితో పాటు, మీ కుటుంబాలు చాలా కాలంగా మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానించేందుకు మీ వాళ్లు వేచిచూస్తున్నారు."

--నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం

వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనపై ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘెల్(bhupesh baghel latest news) స్పందించారు. ప్రభుత్వం చేసిన అన్యాయంపై అన్నదాతలు సాధించిన ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.

"గాంధేయవాద ఉద్యమం మరోసారి తన సత్తాను చాటింది. మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు దేశంలోని రైతులకు అభినందనలు."

---భూపేశ్ బఘేల్, ఛత్తీస్​గఢ్ సీఎం

'నల్ల' వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం సుదీర్ఘ శాంతియుత పోరాట విజయమని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ(charanjit singh channi ) వ్యాఖ్యానించారు.

"పంజాబ్‌లో రైతులు ప్రారంభించిన సుదీర్ఘ శాంతియుత పోరాటం నేడు విజయం సాధించింది. అన్నదాతకు నా వందనం."

--చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ ముఖ్యమంత్రి

"వ్యవసాయ చట్టాల రద్దు రైతులు సాధించిన ఘన విజయానికి చిహ్నం. భారతీయ రైతులు చరిత్రలో అద్భుతమైన పేజీని లిఖించారు. అనేక సవాళ్లను అధిగమించి పోరాడిన రైతులకు శుభాకాంక్షలు."

--పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.