ETV Bharat / bharat

జలియన్​వాలా బాగ్​ను సందర్శించిన సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

NV Ramana Visited Jallianwala Bagh: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ.. పంజాబ్​ అమృత్​సర్​లోని జలియన్​వాలా బాగ్​ను సందర్శించారు.

Chief Justice of India NV Ramana visited Jallianwala Bagh, in Amritsar

author img

By

Published : Apr 13, 2022, 8:32 PM IST

NV Ramana Visited Jallianwala Bagh: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వి. రమణ.. పంజాబ్​లో పర్యటించారు. సతీసమేతంగా అమృత్​సర్​లోని జలియన్​వాలా బాగ్​కు వెళ్లారు. అక్కడి మ్యూజియంను సందర్శించారు. అధికారులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. జలియన్​వాలా బాగ్​ ఊచకోత భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఓ మరిచిపోలేని దుర్ఘటన. బ్రిటీష్​ దురహంకారానికి 500 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన జరిగి ఏప్రిల్​ 13కు 103 ఏళ్లు పూర్తయ్యాయి.

Chief Justice of India NV Ramana visited Jallianwala Bagh, in Amritsar
జలియన్​వాలా బాగ్​లో జస్టిస్​ ఎన్వీ రమణ

జలియన్​వాలా బాగ్​ సందర్శనలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ దంపతులు

జలియన్‌వాలా బాగ్‌ అంటే..? బాగ్‌ అంటే తోట! పేరులో జలియన్‌వాలా బాగ్‌ అని ఉన్నా.. తోట ఏమీ లేదక్కడ. 225 x 180 మీటర్ల ప్రైవేటు వ్యక్తుల స్థలమిది. జల్లా గ్రామంలోని 34 మందికి మహారాజా రంజిత్‌సింగ్‌ దాన్ని దానమిచ్చారు! అందుకే మొదట దీన్ని జల్లావాలాగా పిలిచేవారు. కాలక్రమంలో జలియన్‌వాలా బాగ్‌గా మారింది. చుట్టూ ఇళ్లుండి మధ్యలో ఖాళీగా ఉన్న స్థలమది. ఇళ్ల మధ్య నుంచే సన్నటి దారి ఉంటుందీ స్థలంలోకి!

ఇవీ చూడండి: మూగజీవాలపై 'మహిళ' కర్కశత్వం.. రాత్రిళ్లు వెంటాడి, వేటాడి మరీ!

హోంవర్క్​ చేయలేదా? వేప రసం తాగడమే శిక్ష! వేరే తప్పులు చేస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.