ETV Bharat / bharat

కీలక కేసులు.. చారిత్రక తీర్పులు - ఎన్​.వి. రమణ తీర్పులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్​ ఎన్​.వి. రమణకు 2014లో సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి అనేక కీలకమైన అంశాలను విచారించిన ధర్మాసనాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్​ 370 రద్దు వ్యాజ్యాలు, సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్​ ఏర్పాటు, ఆర్​టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వంటి వ్యాజ్యాలపై విచారణ చేపట్టి కీలక తీర్పులు వెలువరించారు.

justice nv ramana verdicts, nv ramana verdicts
జస్టిస్​ ఎన్​.వి. రమణ, ఎన్​.వి. రమణ తీర్పులు
author img

By

Published : Apr 24, 2021, 11:16 AM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014లో పదోన్నతి పొందిన జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ.. కీలకమైన అనేక అంశాలను విచారించిన ధర్మాసనాల్లో సభ్యులుగా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధం, సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం సహా ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వంటి కేసుల్లో కీలకంగా వ్యవహరించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చారిత్రక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో.. జస్టిస్‌ ఎన్.వి. రమణ సభ్యులు. ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు.. జస్టిస్‌ రమణ ఆదేశాలు ఉపకరించాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ.. 2020 సెప్టెంబర్‌ 17న జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించింది.

ఆర్టికల్​ 370 రద్దు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు.. రాజ్యాంగపరంగా చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సైతం.. జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని.. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్ పునర్విభజన తర్వాత.. ముందు జాగ్రత్తగా అధికారులు జమ్ముకశ్మీర్‌లో.. ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించగా.. వాటిని పునరుద్ధరించాలని చెప్పిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఎన్‌.వి. రమణ సభ్యులు. అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా-2020 కేసులో జమ్ము కశ్మీర్‌లో టెలికాం, ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలు భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గిస్తున్నాయన్న జస్టిస్‌ ఎన్‌. వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులను వారం రోజుల్లో సమీక్షించాలని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తీర్పునిచ్చింది. అదే సమయంలో.. జమ్ముకశ్మీర్‌లో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించాలనే అంశమై జస్టిస్ రమణతో కూడిన ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేసింది.

justice nv ramana verdicts, nv ramana verdicts
తీర్పులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం.. సమాచార హక్కు పరిధిలోనే ఉంటుందంటూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ ఎన్‌.వి. రమణ సభ్యులు. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్-2019 కేసులో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్ గుప్తా, జస్టిస్‌ సంజీవ్ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

మహిళా సాధికారత, సమానత్వం

ముఖ్యంగా మహిళా సాధికారత, సమానత్వ సాధన దిశగా జస్టిస్‌ ఎన్‌. వి. రమణ ఇచ్చిన తీర్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంట్లో గృహిణులు చేసే పని కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తీసిపోదంటూ.. ఈ ఏడాది మొదట్లో జస్టిస్‌ ఎన్‌. వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఇచ్చిన తీర్పుతో మహిళాలోకంలో.. హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కుటుంబసభ్యుల కోసం నిరంతరం కష్టించే గృహిణుల శ్రమను గుర్తించి గౌరవించే విషయంలో.. ఆర్థికంగా ఆ శ్రమవిలువను నిర్ధరించడానికి ఏళ్లుగా అనుసరిస్తున్న విధానంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నది జస్టిస్‌ రమణ అభిప్రాయం. ముఖ్యంగా.. వాహన ప్రమాదాల పరిహారం చెల్లింపు విషయంలో గృహిణుల శ్రమను, కుటుంబసభ్యులకు వారి సేవల విలువను అంచనా వేయటంలో లోపాలను సరిచేయాల్సి ఉందన్నది ఆయన భావన.

"ఉద్యోగం చేసే వ్యక్తుల భవిష్యత్తు ఆదాయాలను గణించటానికి వారి జీతభత్యాలను ఆధారం చేసుకోవటానికి వీలుంటుంది. అయితే, జీవితాంతం కుటుంబ సభ్యుల కోసమే శ్రమించే గృహిణుల సేవలకు ఖరీదు కట్టడం అసాధ్యమైన విషయం. అలాగని వాటిని విలువలేనివిగా భావించటం తగదు. ఇందుకు ప్రత్యేక విధానాలను అనుసరించాలి. మహిళల శ్రమకు సముచిత గౌరవాన్ని, విలువను ఇవ్వాల్సి ఉంటుంది."

--జస్టిస్​ ఎన్​.వి. రమణ

వాహన ప్రమాదంలో దంపతులు చనిపోగా.. వారి పిల్లలకు పరిహారం చెల్లింపుపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రమణ. చనిపోయిన గృహిణి కుటుంబానికి చేసే సేవల విలువను పరిగణనలోకి తీసుకుని.. పరిహారం మొత్తాన్ని పెంచుతూ తీర్పు వెలువరించారు.

మహిళలకు శాశ్వత కమిషన్​

2018లో సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టారు జస్టిస్​ ఎన్​.వి. రమణ. సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకుండా.. మహిళా అధికారులను ఎందుకు వేధిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీన్ని వివక్షగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరి తగదని సూచించారు.

నేషనల్ లీగల్ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో.. 2020లో మహిళలకు చట్టపరంగా లభించే హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో.. ఎంపవరింగ్ ఉమెన్ థ్రూ లీగల్ అవేర్‌నెస్‌ అనే కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శ్రీకారం చుట్టారు.

ఎండీ. అన్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్‌సీటీ ఆఫ్ దిల్లీ 2020 కేసులో.. జస్టిస్ ఎన్‌.వి.రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మానసిక రుగ్మతలకు సంబంధించిన.. ఐపీసీ సెక్షన్ 84ను నిర్వచించింది. మానసిక అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడం వంటి వ్యాధులతో తమను తాము డిఫెన్స్ చేసుకునే వ్యక్తులు.. కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేసింది.

2017 నాటి జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణా కేసులో.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై రాష్ట్రాలు విధించే ఎంట్రీ ట్యాక్స్‌విధానాన్ని సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఒకరు.

అర్చకుల నియామకాలు, తొలగింపు..

2016 నాటి ఆదిశైవ శివాచారియార్గల్ నల సంఘం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో దేవాలయాల్లో అర్చకులను నియమించడం లేదా తొలగించడం.. ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు రాదని జస్టిస్ ఎన్‌.వి. రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అర్చకుల నియామకం.. ఆగమశాస్త్రానికి అనుగుణంగా, రాజ్యాంగ పరమైన ఆదేశాలు, సూత్రాలకు అనుగుణంగా ఉండాలని తీర్పునిచ్చింది.

ఇదే సంవత్సరంలో నబమ్ రెబియా, బమాంగ్ ఫెలిక్స్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేసులో.. ముఖ్యమంత్రి, మంత్రి మండలి, స్పీకర్‌ను సంప్రదించకుండా.. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలని గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. గవర్నర్ ఉత్తర్వులు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, ఆర్టికల్ 174 ఉల్లంఘన కిందకు వస్తాయని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

2012 దిల్లీ హత్యాచార ఘటన కేసులో దోషిగా తేలిన పవన్ కుమార్ గుప్తా.. మరణశిక్ష అమలుపై స్టే విధించాలంటూ వేసిన క్యురేటివ్ పిటిషన్‌ను రద్దుచేసిన ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఒకరు.

ఇదీ చూడండి: 'వీడ్కోలు పలకడం అనేది కష్టమైన పని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.